ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వర్సెస్ జగన్ రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ జగన్ ను టార్గెట్ చేస్తూ ఎటాక్ చేస్తోంది. వైసీపీ సైతం తమ నోళ్లకు పని చెబుతూ బీజేపీపై ఎదురు దాడికి సిద్ధపడుతున్నారు. దీంతో రాష్ర్టంలో పరస్పర దూషణల పర్వంతో రాజకీయం కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం తరువాత జగన్ కేంద్రంతో స్నేహంతోనే మెలుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కు అంతకుమించి వేరే దారి లేకుండా పోయింది. దీంతో బీజేపీతో జగన్ స్నేహహస్తాన్నే చూపిస్తున్నారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి.
రాష్ర్టంలో ఆర్థిక వ్యవస్థ నానాటికి దిగజారిపోతోంది. దీంతో జగన్ కు ఓ వైపు సీబీఐ కేసులు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, పోలవరం లాంటి హామీలు నెరవేర్చలేక పోతున్నారు. దీంతో ప్రత్యేకక హోదా సహా విభజన హామీలు అమలు కాకపోవడంతో జగన్ బీజేపీతోనే ఉంటున్నారు. వైఎస్ జగన్ గతంలో ఇచ్చిన హామీల అమలుకే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో మైత్రి కొనసాగించాలనే చూస్తున్నారు.
జగన్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేసే క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆధారపడక తప్పడం లేదు. వైసీపీ నేతలపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వైసీపీపై అక్రమాస్తుల కేసులు, వైఎస్ వివేకా హత్య కేసు సహా ఇతర కేసులు వెంటాడుతున్న నేపథ్యంలో ఎన్డీయే సర్కారు ఏ మాత్రం సహకరించకపోయినా జగన్ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో జగన్ కేంద్రంపై ఏ వైఖరి ప్రదర్శిస్తారో అని ఎదురు చూస్తున్నారు.
రాష్ర్టంలో పరిస్థితులు మారుతున్నాయి. బీజేపీ నేతలు మతపరమైన విషయాలు వెలుగులోకి తేవడంతో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు జగన్ నుంచి ఆదేశాలు అందడంతో వారు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో బీజేపీ నేతలు వైసీపీ నేతల్లో పరస్పరం మాటల దాడులు పెరిగిపోతున్నాయి. వైసీపీ నేతల విమర్శలకు బీజేపీ కూడా కౌంటర్లు ఇస్తోంది. దీంతో బీజేపీ వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.
సీఎం జగన్ బీజేపీపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. సై అంటే సై అనేందుకు ప్రాధాన్యత ఇష్తోంది. జగన్ పై బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంతో పార్టీపై వ్యతిరేకత వ్యక్తం చేసేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజును సైతం ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీని సైతం ఇదే రీతిగా పక్కకు పెట్టడంలో బీజేపీ సఫలం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్లు సమాచారం.
జగన్ ను సాధ్యమైనంత ఎక్కువగా కోపానికి గురి చేయడంతో పాటు వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రాష్ర్టంలో వైసీపీకి సహజంగానే అసహనం పెరుగుతోంది. చంద్రబాబు తరహాలో జగన్ పై కూడా ఒత్తిడి పెంచి తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ఊహిస్తోంది. దానికి అనుగుణంగానే వైసీపీని ఏకాకి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.