Homeజాతీయ వార్తలుబీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌.. టార్గెట్‌ ఎమ్మెల్సీ

బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌.. టార్గెట్‌ ఎమ్మెల్సీ

TRS vs BJP
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమో కానీ.. మరోసారి అధికార పక్షం, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గురించి బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టును హైలెట్ చేసిన కేటీఆర్.. వరంగల్‌కు పోయి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడా బీజేపీ కూడాగట్టిగానే పోటీ పడుతుండటంతో కేంద్రం చేస్తున్న అన్యాయంపై కేటీఆర్ గళమెత్తారు.

Also Read: కాల్వ మెడకు ఎన్నికల కమిషన్ ఉచ్చు

తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రానికి అలవాటైందని.. కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని.. రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. కేటీఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించడంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడ్డారు. ఐటీఐఆర్ తరహాలోనే టీఆర్ఎస్ వల్లే కోచ్ ఫ్యాక్టరీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణలో అలసత్వం కారణంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి తరలిపోయింది, కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు వచ్చే అవకాశాలు లేవని బీజేపీ నేత డీకే అరుణ తేల్చి చెప్పేశారు. ఇతర నేతలు కూడా అదే చెబుతున్నారు.

కేంద్రం విభజన హామీల ప్రకారం చూసుకుంటే.. అనేక హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ లేవనెత్తడానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రెడీగా ఉంటుంది. నల్లగొండలోనూ అనేక అంశాలు ఉంటాయి. బీజేపీని ఇరుకున పెట్టడానికి టీఆర్ఎస్‌కు కావాల్సినన్ని అస్త్రాలున్నాయి. అయితే.. అన్నింటినీ టీఆర్ఎస్ వల్లే రాలేదంటూ దూకుడుగా ఎదురుదాడికి దిగుతూ.. బీజేపీ కూడా ఘాటు రాజకీయం చేస్తూనే ఉంది.

Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి ప్రణాళికలు.. అందుకే కేసీఆర్‌‌ ఆలయాన్ని సందర్శించారా..?

మొత్తంగా మరోసారి ఇరుపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం మరోసారి యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ఛాలెంజ్‌గా తీసుకోవడంతో విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్‌ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ తాపత్రయ పడుతుండగా.. బీజేపీ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌ ప్రయత్నాల్లో ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version