https://oktelugu.com/

BJP Vs TRS: కేసీఆర్ సర్కారుపై అమిత్ షా అస్ర్తం?

BJP vs TRS: తెలంగాణలో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ తన శక్తియుక్తులను ప్రయోగించి అధికారం సాధించాలని ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో రాష్ర్టంలో సుడిగాలి పర్యటన చేస్తున్న రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. సెప్టెంబర్ 17న సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాకతో బీజేపీలో నూతనోత్తేజం నింపాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అమిత్ షా పర్యటనపై బీజేపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 12, 2021 / 05:01 PM IST
    Follow us on

    BJP vs TRS: తెలంగాణలో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ తన శక్తియుక్తులను ప్రయోగించి అధికారం సాధించాలని ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో రాష్ర్టంలో సుడిగాలి పర్యటన చేస్తున్న రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. సెప్టెంబర్ 17న సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాకతో బీజేపీలో నూతనోత్తేజం నింపాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

    అమిత్ షా పర్యటనపై బీజేపీ ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ హాజరై సభా నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. అమిత్ షా పర్యటన సందర్బంగా స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ లో సమావేశం జరిగింది. రాష్ర్టంలో టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. దీని కోసం పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు.. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెబుతున్నారు.

    1948 సెప్టెంబర్ 17న సర్ధార్ వల్లభాయి పటేల్ నిజాం ను అదుపులోకి తీసుకుని తెలంగాణకు స్వాతంత్ర్యం తెస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు బీజేపీ కూడా అదే పని చేస్తుందని నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణలో మార్పు తథ్యమని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు.

    టీఆర్ఎస్ ఇప్పటికే దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. బీజేపీ కూడా అంతే స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ అందరిలో ప్రశ్నలు లేవనెత్తుతోంది. బీజేపీ 2023లో అధికారంలోకి వచ్చి గోల్కొండలో జెండా ఎగురవేయాలని భావిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలకు అమిత్ షా మూడు సార్లు వస్తారని తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఆయన పర్యటన ఖరారు అవుతుందని చెబుతున్నారు. నిర్మల్ సభకు మూడు లక్షల మందిని తరలించాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు.

    రెండు పార్టీలు ముందంజలో ఉండగా కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇంతవరకు పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. దీంతో ప్రచారంలో మాత్రం వెనుకంజలో పడిపోయింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక దూకుడు మీదున్నా హుజురాబాద్ విషయంలో మాత్రం ఎందుకో నిర్లక్ష్యం గా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.