https://oktelugu.com/

Delhi Liquor Scam – Kejriwal : కేజ్రీవాల్ కు ‘లిక్కర్’ మరక.. బీజేపీ దూకుడు వెనుక ప్లాన్ ఇదీ

Delhi Liquor Scam – Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కొద్దిరోజులపాటు నిశ్శబ్దంగా ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రారంభించాయి. ఇన్ని రోజులపాటు దర్యాప్తు అంతగా ఊపందుకోవడం లేదని లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో .. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది.. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టు చేసింది. ఈసారి ఏకంగా అరవింద్ కు నోటీసులు పంపింది. విచారణకు […]

Written By:
  • Rocky
  • , Updated On : April 14, 2023 / 08:40 PM IST
    Follow us on

    Delhi Liquor Scam – Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కొద్దిరోజులపాటు నిశ్శబ్దంగా ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు ప్రారంభించాయి. ఇన్ని రోజులపాటు దర్యాప్తు అంతగా ఊపందుకోవడం లేదని లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో .. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది.. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టు చేసింది. ఈసారి ఏకంగా అరవింద్ కు నోటీసులు పంపింది. విచారణకు రావాలని అందులో పేర్కొన్నది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    ఢిల్లీలో గతంలో రూపొందించిన మద్యం పాలసీ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు పలువురు సౌత్ గ్రూపునకు చెందిన సభ్యులకు అందాయని సిబిఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో సౌత్ గ్రూప్ సభ్యులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తులో భాగంగా అరవింద్ కు నోటీసు పంపినట్టు సిబిఐ అధికారులు చెబుతున్నారు.

    అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పై అరవింద్ మండిపడుతున్నారు. అంతేకాదు మనిష్ అరెస్టును కూడా ఆయన విమర్శిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ పకడ్బందీ ఆధారాలతో ముందుకు వెళ్తోంది. సిబిఐ విచారణను నిలువరించేందుకు చీపురు పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. సిబిఐ విచారణకు పిలిచిన నేపథ్యంలో అరవింద హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

    ఇక ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ 15 కోట్ల రూపాయలను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇచ్చినట్టు ఆరోపించాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ నిందితుడు తన న్యాయవాది ద్వారా కవితతో తాను చేసిన వాట్స్అప్ చాటింగ్ ను మీడియాకు విడుదల చేశాడు. ఈ క్రమంలో అతడి ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండించింది. అంతేకాదు భారత రాష్ట్ర సమితిని బద్నాం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. ప్రస్తుతం తన కాలు ఫ్రాక్చర్ కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్టు కవిత వెల్లడించింది. సుఖేష్ వాట్సప్ చాటింగ్ ను బయటకు విడుదల చేసిన ఒకరోజు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కి సిబిఐ నోటీసులు ఇవ్వడం విశేషం.

    మరోవైపు ఇటీవల ఖలిస్తాని ఏర్పాటు వాదులు రెచ్చిపోతున్నారు. పంజాబ్ కేంద్రంగా వికృత క్రీడలకు పాల్పడుతున్నారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. పైగా అక్కడి ఖలిస్తాని వేర్పాటు వాదులకు సహకరిస్తోంది.. దీంతో ఎలాగైనా ఈ ఉపద్రవానికి చెక్ పెట్టాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది. పైగా ఆ ఖలిస్తాని వేర్పాటు వాదులు ఏకంగా ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రికి హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వైపు దృష్టి మళ్లించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వేర్పాటువాదులకు సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు అందాయని సిబిఐ గుర్తించినట్టు విశ్వసినీయ వర్గాల సమాచారం. జగన్ ఢిల్లీ ముఖ్యమంత్రిని ప్రశ్నించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.