MP Arvind- MLC Kavitha: తెలంగాణాలో నువ్వా నేనా.. అన్నట్లుగా దర్యాప్తు సంస్థలతో ఆధిపత్య యుద్ధం చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల తీరుతో రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. కేంద్రం ఐటీ, ఈడీతో దూకుడు ప్రదర్శిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సిట్‌తో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలతో రెండు పార్టీల క్యాడర్‌లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండడంతో ఇప్పటి నుంచే టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అన్ని విధాలుగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

దాడి కేసులో హైకోర్టు తలుపు తటì ్టన ఎంపీ..
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపైన కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది.
కవిత వ్యాఖ్యలతోనే దాడి..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన ఇంటిపై టీఆర్‌ఎస్ శ్రేణులు చేసిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ కవితపై ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు, కవిత తీవ్రంగా స్పందించారు. చెప్పుతో కొడతా అని, అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఎక్కడికి వెళ్లినా మెత్తగా తంతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణ జాగృతి సభ్యులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కవిత చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే కార్యకర్తలు రెచ్చిపపోయి దాడిచేశారని అందరూ భావిస్తున్నారు.
అరవింద్ వ్యాఖ్యలకు.. కవిత కౌంటర్..
కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లికార్జున ఖర్గే తో మాట్లాడారని, ఆ విషయం తనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత ముఖ్యులు చెప్పారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసి.. తన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తానని, ఎక్కడికి వెళితే అక్కడ తంతామని మండిపడ్డారు. ఇక ఆ తర్వాత అందులో భాగంగా ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
దాడికి కవితే బాధ్యురాలని..
మొదట ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి రాళ్లు విసిరిన కార్యకర్తలు, ఆపై పూల కుండీలు పగలగొట్టారని, కిటికీలు తలుపులు ధ్వంసం చేశారు. అనంతరం ఇంట్లోకి చొరబడి పూజ గదితోసహా అన్ని గదులలో ఉండేవస్తువులు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కవిత వ్యాఖ్యల కారణంగానే తన ఇంటిపై దాడి జరిగిందని అరవింద్ భావించారు. ఈమేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కవితపై కేసు నమోదు చేయలేదు. దీంతో కవితపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అరవింద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ క్యాడర్‌లో టెన్షన్ నెలకొంది.

లైవ్‌లో ఉంచాలని..
టీఆర్‌ఎస్ బీజేపీపై ఎదురు దాడి, అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం, బండి సంజయ్ యాత్రను అడ్డుకోవడం వంటి చర్యలకు దిగుతోంది. దీంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా బీజేపీ కూడా టీఆర్‌ఎస్ చర్యలపై నిత్యం ప్రజల్లో చర్చ జరిగేలా వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేసిన కమలనాథులు.. కేసీఆర్ కూతురుపై లీగల్‌గా ప్రెషర్ తెచ్చే ప్రయత్నంలో భాగంగా అరవింద్ ద్వారా పిటిషన్ వేయించినట్లు తెలుస్తోంది.
తొమ్మిది మందిపైనే కేసు..
అర్వింద్ ఇంటిపై చేసిన దాడి ఘటనలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు నిందితులపై అతిక్రమణ, ఆస్తి నష్టం, బెదిరింపు వంటి అభియోగాలు మోపారు. ఘటనా స్థలంలో 2 సిమెంట్ రాళ్లు, 2 టీఆర్‌ఎస్ పార్టీ జెండాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.