ఎమ్మెల్యే సంచలనం.. రాజీనామా నిర్ణయం

హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ర్టంలో సంచలనంగా మారుతోంది. సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకంతో రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాలకు ఆ పథకం వర్తింపచేయాలని భావిస్తూ ఎవరికి వారు రాజీనామా చేసి ఉప ఎన్నిక పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే కోవలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం తన పదవి వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తన నియోజకవర్గం బాగు పడితే చాలని భావించి రాజీనామా చేస్తానని ప్రకటించారు.దీంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఎక్కడికి ప్రజాప్రతినిధులు వెళ్లినా తమకు దళితబంధు పథకం […]

Written By: Srinivas, Updated On : August 2, 2021 7:11 pm
Follow us on

హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ర్టంలో సంచలనంగా మారుతోంది. సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకంతో రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాలకు ఆ పథకం వర్తింపచేయాలని భావిస్తూ ఎవరికి వారు రాజీనామా చేసి ఉప ఎన్నిక పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే కోవలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం తన పదవి వదులుకోవడానికి సిద్ధపడ్డారు. తన నియోజకవర్గం బాగు పడితే చాలని భావించి రాజీనామా చేస్తానని ప్రకటించారు.దీంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఎక్కడికి ప్రజాప్రతినిధులు వెళ్లినా తమకు దళితబంధు పథకం కావాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రజలకు మంచి జరగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని ప్రజల నుంచి ఒత్తి వస్తున్న నేపథ్యంలో దళిత బంధు పథకం అమలుపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఏదో హుజురాబాద్ ఎన్నికలో లబ్ధిపొందాలనే భావనతో కేసీఆర్ తీసుకొచ్చిన పథకంపై రాష్ర్టమంతా స్పందన రావడం ఆందోళన కలిగిస్తోంది. టీఆర్ ఎస్ వర్గాల్లో ప్రస్తుతం దళితబంధు భయం పట్టుకుంది. ఎలాగైనా తమకు సైతం పథకం వర్తిప చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు.

ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారు. అధికార పార్టీ ఎన్నికల జిమ్మిక్కు కోసం ప్రకటించిన పథకం ఇప్పుడు రాష్ర్టవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి నాయకులకు ఒత్తిడి పెరుగుతోంది. ఉప ఎన్నిక వస్తే తప్ప నిధులు కేటాయించడం లేదని విమర్శిస్తున్నారు. అందుకే పదవీ త్యాగానికి వెనుకాడడం లేదని పేర్కొన్నారు.

గోషామహల్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సైతం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రం సమర్పిస్తానని స్పష్టం చేశారు. దీంతో రాజాసింగ్ దారిలోనే అందరు నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయే సూచనలు కనిపించడంతో మిగతా ప్రాంతాలపై దృష్టి సారించడం లేదని చెబుతున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే అక్కడ నిధుల వరద పారేందుకు మార్గం ఏర్పడిందన్నారు. దీంతో రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల పరిస్థితి మరాలంటే నిధులు అవసరమని చెప్పారు. అందుకే నియోజకవర్గాల భవిష్యత్ మారాలంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం గురించి చెప్పారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం రాజీనామాలు చేయాల్సి వస్తుందేమోననే సందేహాలు వస్తున్నాయి.