KCR Eetela Rajender: అసెంబ్లీలో ఈటల ముఖం చూడడం కూడా కేసీఆర్ కు ఇష్టం లేదు.. అందుకే మళ్లీ సస్పెన్షనా? దారుణం ఇదీ!

KCR Eetela Rajender: తెలంగాణ అసెంబ్లీలో తన ప్రత్యర్థి ఈటల రాజేందర్ ముఖం కూడా చూడడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేనట్టు ఉంది. తెలంగాణ కేబినెట్ నుంచి గెంటేశాక.. ఈటల బీజేపీలో చేరి కేసీఆర్ పంతం పట్టినా కూడా గెలిచి మరీ అసెంబ్లీకొచ్చారు. అసెంబ్లీలో ఈటల ఖచ్చితంగా కేసీఆర్ పై ఏదో ఒక మాట అనడం ఖాయం. అందుకే ముందస్తుగానే ఈటల రాజేందర్ కు వాయిస్ లేకుండా చేసేందుకు కేసీఆర్, టీఆర్ఎస్ వర్గాలు రెడీ అయినట్టు […]

Written By: NARESH, Updated On : September 13, 2022 10:48 am
Follow us on

KCR Eetela Rajender: తెలంగాణ అసెంబ్లీలో తన ప్రత్యర్థి ఈటల రాజేందర్ ముఖం కూడా చూడడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేనట్టు ఉంది. తెలంగాణ కేబినెట్ నుంచి గెంటేశాక.. ఈటల బీజేపీలో చేరి కేసీఆర్ పంతం పట్టినా కూడా గెలిచి మరీ అసెంబ్లీకొచ్చారు. అసెంబ్లీలో ఈటల ఖచ్చితంగా కేసీఆర్ పై ఏదో ఒక మాట అనడం ఖాయం. అందుకే ముందస్తుగానే ఈటల రాజేందర్ కు వాయిస్ లేకుండా చేసేందుకు కేసీఆర్, టీఆర్ఎస్ వర్గాలు రెడీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాక రెండు సార్లు తెలంగాణ అసెంబ్లీ సమావేశమైంది. క్రితం సారి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను ఉత్తి పుణ్యానికే సస్పెండ్ చేశారు. ఈసారి రఘునందన్ రావును అనుమతించిన టీఆర్ఎస్ వర్గాలు ఈటల రాజేందర్ కు షాకిచ్చాయి. మరోసారి ఆయనపై సస్పెన్షన్ వేటు వేశాయి. ఈసారి ఈటల రాజేందర్ స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కారణంగా చూపాయి.

తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మంగళవారం మరోసారి సస్పెండ్ చేశారు. స్పీకర్ పోచారంపై అనుమతి వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోవడంతో ఈటల ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఇక అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున కూడా బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదు. ఈ విషయమై అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఈటల రాజేందర్ ఈణెల 6న మీడియాతో మాట్లాడారు. స్పీకర్ మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పుపట్టింది. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే.. ఈటల ఏం బూతులు తిట్టకున్నా.. పరుష పదజాలం వాడకున్నా కేవలం ‘మరమనిషి’ అన్నాడని సస్పెండ్ చేయడాన్ని బట్టి అసలు ఈటల ముఖం కూడా అసెంబ్లీలో చూడకూడదని కేసీఆర్ డిసైడ్ అయినట్టు ఉన్నారు. అందుకే ఏదో కారణం చేత బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూనే ఉన్నారు. వారికి ప్రజా సమస్యలపై వాయిస్ లేకుండా చేస్తున్నారు.