BJP leader Parthasarathi కర్నూలులో వైసీపీ నేతల దౌర్జన్యంపై బీజేపీ నేత పార్థసారథి కడిగిపారేశారు. పబ్లిక్ స్థలంలో ప్రైవేటుగా గోడకడుతారా? ఎదిరించిన వారిని కేసులతో అరెస్ట్ లు చేయిస్తారా? అని పార్థసారథి ప్రశ్నించారు.ఇంతకంటే దారుణం ఇంకా ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.

పొనుగొండలో శోభయాత్ర చేస్తుంటే.. రాళ్లు రువ్వి గొడవ జరిగితే పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యేకు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వైసీపీ బ్యాచ్ దాడులు చేస్తోందని పార్థసారథి విమర్శించారు.
పెళ్లి డీజే పెట్టుకుంటే వైసీపీ నేతలు దాడులు చేశారని పార్థసారథి విమర్శించారు. వైసీపీ నేతలపై కేసులు కూడా పోలీసులు పెట్టడం లేదని.. న్యాయం కూడా జరగడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రశ్నిస్తారని పార్థసారథి మండిపడ్డారు.
తాను ఒక బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ తాగినందుకు అతడికి రావాల్సిన ఇల్లును వైసీపీ నేతలు క్యాన్సిల్ చేయించారని పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. మూడేళ్లలో ప్రతిపక్షాలను అణగదొక్కారని.. అందుకే ప్రతిపక్షాల సభలకు ఇంత పెద్ద ఆదరణ వస్తోందని.. ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు.
ఇక ఇదే సమయంలో వైసీపీ గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలను నిలదీస్తున్నారని.. ఇది వైసీపీ పాలనపై వ్యతిరేకత చిహ్నం అని పార్థసారతి విమర్శించారు. వైసీపీ సభలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలపై ప్రజలు కూడా చీత్కరిస్తున్నారని విమర్శించారు.
-పార్థసారథి మాట్లాడిన వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.