తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై మిత్రపక్షాలైన బీజేపీ-జనసేనలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడినట్టు సమాచారం. అక్కడ కమలమే బరిలో ఉంటుందని, ఇందుకు పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Also Read: బ్రేకింగ్: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అప్పటి నుంచే..
నడ్డాకు చెప్పారట..
తిరుపతి సీటు బీజేపీకే కేటాయించేందుకు జనసేనాని తన అంగీకారం తెలిపారని, అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకే చెప్పారని కాషాయ నేతలు అంటున్నారు. ఇటీవల పవన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో నడ్డాను కలిసిన పవన్.. అప్పుడు జరిగిన చర్చల్లో తిరుపతిలో పోటీవిషయమై క్లారిటీ ఇచ్ఛారని చెబుతున్నారు. అభ్యర్థి ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, ప్రచారం ఎలా చేపట్టాలి? ఎలాంటి అస్త్రాలను ఎంచుకోవాలనే అంశంపై ఫోకస్ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు పార్టీ నేతలకు సూచించారట.
బీజేపీ ఏకపక్ష నిర్ణయమా?
పవన్ ఢిల్లీ వెళ్లి చాలా రోజులవుతోంది. అప్పుడే బీజేపీకి సీటు కేటాయించడానికి ఓకే చెప్తే.. ఆ విషయాన్ని పవన్ బయటకు ఎందుకు చెప్పట్లేదనేది ప్రశ్న. తిరుపతిలో తామే పోటీచేస్తున్నాం అని బీజేపీ ప్రకటించుకోవడం తప్ప, ఇప్పటి వరకూ పవన్ దీనిపై మాట్లాడలేదు. నిజంగానే అంగీకారం కుదిరితే.. ఇరు పార్టీల నేతలూ కలిసి.. మీడియా ముఖంగా వివరాాలు వెల్లడించే వారు కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Also Read: చంద్రబాబు వద్దు.. జగన్ తోనే బీజేపీ ఫ్రెండ్ షిప్?
పవన్ ఏం చేస్తారు?
తిరుపతిలో నిలబడి గెలవడం ద్వారా తమ బలాన్ని నిరూపించుకోవాలని పవన్ ఆరాటపడుతున్నారు. కానీ.. బీజేపీ తామే నిలబడాలని, తమ బలం పెంచుకోవాలని యోచిస్తోంది. బీజేపీ నేతలు మాత్రం పవన్ అంగీకరించారని, పోటీ చేసేది తామేనని అంటున్నారు. మరి, పవన్ ఏం చేస్తారు..? గ్రేటర్ లో మాదిరిగానే పోటీ విరమించుకొని బీజేపీకి మద్దతు తెలుపుతారా..? వెనక్కి తగ్గేది లేదంటూ బరిలో నిలబడతారా? అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్