https://oktelugu.com/

వైసీపీ రౌడీ రాజ్యానికి త్వరలోనే బుద్ది చెప్తామంటున్న బీజేపీ-జనసేన

పంచాయితీ ఎన్నికల వేళ బీజేపీ-జనసేన స్పీడు పెంచాయి. ఏకంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో ప్రశాంతంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. నామినేషన్లతో బలవంతపు ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని.. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే యత్నం చేస్తోందని బీజేపీ-జనసేన నాయకులు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గవర్నర్ ను కలిసిన అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడరాు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీకి ఉందని.. ఈసారి అలాంటి పరిస్తితులు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2021 / 05:04 PM IST
    Follow us on

    పంచాయితీ ఎన్నికల వేళ బీజేపీ-జనసేన స్పీడు పెంచాయి. ఏకంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో ప్రశాంతంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. నామినేషన్లతో బలవంతపు ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని.. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే యత్నం చేస్తోందని బీజేపీ-జనసేన నాయకులు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

    గవర్నర్ ను కలిసిన అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడరాు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీకి ఉందని.. ఈసారి అలాంటి పరిస్తితులు తలెత్తకుండా చూడాలని గవర్నర్ ను కోరామన్నారు. ఏకగ్రీవాలు సహజమే అయినా ప్రలోభపెట్టి భయపెట్టాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు.

    ఇక సోము వీర్రాజు అధికార వైసీపీ పార్టీ అరాచకాలపై నిప్పులు చెరిగారు. ఈసారి పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు జరగకుండా చూడాలని గవర్నర్ ను కోరామన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ిన ఆదేశించాలని గవర్నర్ ను కోరినట్లు సోము వీర్రాజు తెలిపారు.

    ఎన్నికల్లో ఆన్ లైన్ నామినేషన్ విధానం అమలు చేయాలని గవర్నర్ ను కోరినట్లు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో మత విద్వేషాలను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొడుతోందన్నారు.

    మొత్తానికి అటు పంచాయితీ నామినేషన్లకు దగ్గరపడుతున్న వేళ ఇంకా సీట్ల పంచాయితీ తేలకముందే బీజేపీ, జనసేనలు మాత్రం అధికార, ప్రతిపక్షాలకు ధీటుగా ఏపీలో రాజకీయం మొదలుపెట్టాయనే చెప్పొచ్చు.