Homeజాతీయ వార్తలుTelangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?

Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?

Telangana BJP: రాష్ర్టంలో ముందస్తు వేడి రాజుకుంటోంది. కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్న క్రమంలో పలు పార్టీలు ముందస్తుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ వ్యూహాలు ఖరారు చేసుకుంటోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారనే జోస్యం చెబుతుండటంతో అందరిలో ముందస్తు భయం పట్టుకుంది. ఒకవేళ ముందస్తు కు వెళితే పాటించాల్సిన విధానాలపై కసరత్తు ప్రారంభించాయి. దీంతో పార్టీలు ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

Telangana BJP
BJP and TRS

ఇప్పటికే అభ్యర్థుల ఖరారుపై బీజేపీ దృష్టి సారించింది. గెలిచే వారిని ముందే నిర్ణయించి వారికి టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పోటీ లేని ప్రాంతాల్లో టికెట్లు కేటాయించి పోటీ ఉన్న చోట ముగ్గురి చొప్పున అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోంది. ఇందులో ఎవరికి ప్రజాబలం ఉంటే వారికి టికెట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో అభ్యర్థుల్లో అప్పుడే సందడి నెలకొంది. తమ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించేందుకు తయారు అవుతున్నారు. దీంతో బీజేపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.

Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్

మరోవైపు అంబేద్కర్ జయంతి రోజు రెండో విడత ప్రారంభమయ్యే ప్రజాసంగ్రామ యాత్రతో బండి సంజయ్ మరోమారు ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మొదటి యాత్రలో టీఆర్ఎస్ ను ఎండగట్టిన బండి సంజయ్ ఈ మారు కూడా గులాబీ నేతల్ని టార్గెట్ చేసుకుని రెచ్చిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. కేసీఆర్ ముందస్తుకు వెళతారనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది. కేటీఆర్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.

Telangana BJP
Bandi Sanjay Vs KCR

ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డాతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు సమాచారం. దీనికి తోడు టీఆర్ఎస్ కూడా ఇటీవల జిల్లాల పర్యటనకు ప్రాధాన్యం ఇస్తుండటంతో పార్టీల్లో ముందస్తు జ్వరం పట్టుకుంది. మొత్తానికి ఈ ముందస్తు వేడి ఎవరికి తాకుతుందో ఏ పార్టీ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుందో తెలియడం లేదు. ఏదిఏమైనా ముందస్తు ఎన్నికల జ్వరం అందరికి అంటుకునేలా ఉందని కనిపిస్తోంది. దీంతో అధికార పార్టీకే తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళితే బీజేపీ లాభం జరిగి టీఆర్ఎస్ కు భంగపాటే అనే వాదనలు సైతం వస్తున్నాయి.

Also Read: CM Jagan Election 2024: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

7 COMMENTS

  1. […] Vivek Agnihotri: ద కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశంలో చలన చిత్ర రంగంలో ఓ మోత మోగిస్తోంది. బాక్సాఫీసు కలెక్షన్లు సంచలనం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలోనే వంద కోట్ల గ్రాఫ్ సాధించి సరికొత్త రికార్డు తిరగరాసింది. చిత్రానికి వస్తున్న వసూళ్లు చూస్తుంటే బాలీవుడ్ లోనే కాకుండా మొత్తం పరిశ్రమనే ఓ కుదుపు కుదిపేస్తోంది. చలన చిత్ర రంగంలోనే అత్యంత కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా పేరు సాధించింది. […]

  2. […] AP Movie Ticket Rates:  ఏపీలో మూవీ టికెట్లపై రేట్ల విషయం ఇంకా చల్లారలేదు. ఇక పెద్ద మూవీస్ రిలీజ్ అయితే ఆ హీరోల ఫ్యాన్స్ చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. మూవీ టికెట్ల ధరలు ఇంతేనా అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. దీనికి ప్రతి పక్షాలు సైతం తోడవుతున్నాయి. కానీ వాస్తవానికి మాత్రం పెంచిన రేట్లు కొద్ది రోజులు మాత్రమే అమలయ్యాయి. కానీ థియేటర్ల యాజమాన్యాలు రేట్లు అడ్డగోలుగా పెంచేసి టికెట్టు అమ్మేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ రిలీడ్ అవుతుండటంతో టికెట్ల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular