Captain Laxmikanth: ఎక్కడైనా ఎన్నికలు వస్తే ఆ ప్రాంతంలో ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా అయితే అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి లేదా అప్పటి వరకు అక్కడ ఎమ్మెల్యేగానో లేదా ఇతర ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థికి అధికంగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే విజయం చేజారిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అంశం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.

హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ నడుస్తోంది. అక్కడ ప్రచారం, పోటీ రసవత్తంగా సాగింది. ఇప్పుడు ఫలితాలు కూడా అంతే రసవత్తరంగా వస్తున్నాయి. మొదటి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యంలో ఉంటోంది. మొదటగా ప్రకటించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 8వ రౌండ్, 11వ రౌండ్ ఫలితాలు మాత్రం టీఆర్ఎస్‌కు కొంత ఆశాజనకంగా వచ్చింది. అయితే ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య భారీ తేడా ఏం కనిపించడం లేదు. ఎవరికి విజయం వరించినా కొంత తేడాతోనే అది జరగొచ్చు.
రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్యే ఊర్లో బీజేపీ హవా..
మనం ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం మాట్లాడుకోవాలి. టీఆర్ఎస్ కు మొదటి నుంచి అండగా ఉన్న కెప్టెన్ లక్ష్మీ కాంత్, ఆయన కుమారుడు ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ల సొంత ఊరైన సింగాపురం టీఆర్ఎస్ వెనకబడింది. అక్కడ బీజేపీ లీడ్‌లో ఉంది. కెప్టెన్ లక్ష్మీ కాంత్ అంటే టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఆయన సొంత గ్రామంలో కూడా బీజేపీ గాలులు వీచాయంటే.. టీఆర్ఎస్‌పై ప్రజలకు వ్యతిరేకత వచ్చిందనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కెప్టెన్ లక్ష్మీకాంత్ కుటుంబానికి పట్టు ఉన్న తుమ్మనపల్లి, బోర్పపల్లి గ్రామాల్లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు అధికంగా ఓట్లు వచ్చాయి.
Also Read: Gellu Srinivas Yadav: ఎంతటి అవమానం.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు సొంతూరి వాసుల షాక్
అలాగే దళిత బంధు పథకం ప్రారంభించిన శాలిపురం గ్రామంలో కూడా టీఆర్ఎస్ వెనకబడింది. అక్కడ బీజేపీ కే అధిక ఓట్లు వచ్చాయి. ఈ అంశాలన్నింటినీ గమనిస్తే ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఏర్పడిందని, ఈటల పట్ల ఏ మాత్రం అభిమానం తగ్గలేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చివరి ఈవీఎం ఫలితం వచ్చేంత వరకు విజేత ఎవరో అనే ఉత్కంఠకు తెరపడేలా లేదు.
Also Read: టీఆర్ఎస్ గెలిస్తేనే ఆ నేతకు రాజకీయ భవిష్యత్తు.. ఎవరాయన ? ఎందుకు ?