BJP Local Bodies: భారతీయ జనతాపార్టీ.. ప్రపంచంలో అత్యధిక సభ్యంత్వం కలిగిన పార్టీ. 12 ఏళ్లుగా దేశంలో అధికారంలో ఉంది. ఉత్తరాది పార్టీగా పదేళ్ల క్రితం వరకు బీజేపీకి ముద్ర ఉండేది. కానీ తర్వాత దక్షిణాదిన కూడా పాగా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. కేరళ, తెలంగాణ, తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. దక్షిణాదిలో బీజేపీ అర్బన్ పార్టీగానే గుర్తింపు ఉంది. కానీ 2025 డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది. ప్రాంతీయ పార్టీలను మించి సీట్లు గెలిచింది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గోవా, అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 117 స్థానాలతో ముందంజలో నిలిచింది. మిత్ర పక్షాలు ఈక్‌నాథ్ శిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ కలిసి 200+ సీట్లు సాధించాయి. మహాఘట్‌బంధన్‌కు 37 మాత్రమే వచ్చాయి. ఈ మైత్రి విజయం బీజేపీ దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో బలపడుతుందనడానికి నిరద్శనం.
కర్ణాటకలో అధికార పార్టీకి షాక్..
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో పట్టణ స్థానిక సంస్థల్లో బీజేపీ 40 సీట్లతో ఆధిక్యం చెప్పింది. కాంగ్రెస్ 23, జేడీఎస్ ఒకటి, స్వతంత్రులు 2 మాత్రమే గెలిచారు. అధికార పార్టీని కాదని అక్కడి ఓటర్లు బీజేపీకి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు.
గోవాలో..
ఉత్తరాది రాష్ట్రం గోవాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ–మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కూటమి 32 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 10, ఆప్ 1, స్వతంత్రులు 4. అధికార బీజేపీ స్థానిక స్థాయిలో బలపడినట్టు నిదర్శనం.
అరుణాచల్ ప్రదేశ్..
అరుణాచల్‌లో జిల్లా కౌన్సిల్‌లో బీజేపీ 170 సీట్లు, పంచాయతీల్లో 6,085 సీట్లు గెలిచాయి. పీపీఏ 648, ఎన్‌పీపీ 160, స్వతంత్రులు 627, కాంగ్రెస్ 216 గెలిచాయి. ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యం పెరగడం గమనార్హం.
కేరళలో..
కేరళ పంచాయతీల్లో యూడీఎఫ్ 505, ఎల్‌డీఎఫ్ 345, స్వతంత్రులు 64, బీజేపీ 26 సీట్లు గెలిచాయి. తిరువనంతపురం మున్సిపాలిటీలో బీజేపీ గణనీయ పురోగతి చెందింది. గతంతో పోలిస్తే చాలా పంచాయతీల్లో బీజేపీ విజయం షాధించింది.
ఈ ఎన్నికలు బీజేపీ అట్టడుగుస్థాయి బలాన్ని చూపుతున్నాయి. అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలపడింది. 2024 లోక్‌సభ తర్వాత పార్టీ స్థానిక స్థాయిలో దృష్టి పెట్టి, దక్షిణ–ఈశాన్యంలో పట్టు పెంచుకుంది. తెలంగాణలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.