MP Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. తమ గ్రామానికి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చకపోవడంపై ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఇచ్చిన హామీ ఎందుకు తీర్చలేదని ఫైర్ అయ్యారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఎంపీకి మద్దతుగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది. గ్రామస్తులకు కార్యకర్తలకు మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసినా గ్రామస్తులు శాంతించలేదు. దీంతో ఎంపీని అక్కడి నుంచి పంపించారు.

తిరుగు ప్రయాణంలో కూడా గ్రామస్తులు మళ్లీ ఎంపీ కాన్వాయ్ ని అడ్డుకుని రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకున్నా ఎంపీ కారు అద్దాలు ధ్వంసం కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. గోదావరి ముంపును పరిశీలించేందుకు వచ్చిన ఎంపీని గ్రామస్తులు చుట్టుముట్టారు. ఇచ్చిన హామీని ఎందుకు తీర్చరని ప్రశ్నించారు. దీంతో ఎంపీ నివ్వెరపోయారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్ పై దాడి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది.
Also Read: Minister Roja: ఓకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్.. రోజా హాట్ కామెంట్స్
నేతలు హామీలిస్తారు తరువాత మరిచిపోతారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు షాక్ కు గురవడం తెలిసిందే. అలా ఎంపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో వారిలో ఆగ్రహం పెరిగిపోయింది. దీంతో ఆయన పర్యటన గురించి తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఆయనపై దాడికి యత్నించడం గమనార్హం. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి ప్రమాదాలే ఎదురవుతాయి. ఒకసారి అడ్డుకున్నప్పుడు మళ్లీ ఆ దారిలో వెళ్లడం ఎందుకు? వారితో గొడవ పెట్టుకోవడమెందుకు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

మొత్తానికి ఎంపీ అరవింద్ తీరుతో అన్ని చోట్ల విమర్శలే ఎదుర్కొంటున్నారు. పొగాకు బోర్డు తీసుకురాలేదని ఇప్పటికే విమర్శలకు గురికాగా ఇప్పుడు ఎర్దండి ప్రజలతో చిక్కొచ్చిపడింది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇలాంటి వివాదాలే చోటుచేసుకుంటాయనడంలో సందేహం లేదు. దీనిపై ఇంకా ఎంపీ ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియడం లేదు. తక్షణమే వారికి వంతెన మంజూరు చేసి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:CM KCR: కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రభుత్వం 9,456 కోట్లు కోల్పోయింది
[…] Also Read:MP Dharmapuri Arvind: పాపం బీజేపీ ఎంపీ అరవింద్.. ఎక్… […]