Bihar Assembly Elections 2025: దేశ వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. అక్కడ అత్యంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. అందులో బీహార్ రాష్ట్రం కూడా ఒకటి. బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల దృష్ట్యా ఎన్నికల సంఘం రెండు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తోంది.
బీహార్ వెనకబడిన రాష్ట్రం అనేది అందరికీ తెలుసు. పైగా ఆ ప్రాంతంలో అక్షరాస్యత అంతంత మాత్రమే ఉంటుంది.. ఇక్కడ నేరాలకు.. ఘోరాలకు పాల్పడే వ్యక్తులకు కొదవ ఉండదు.. అటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే హింసాయుత ఘటనలు చోటుచేసుకుంటాయి. గతంలో ఈవీఎంలను ఎత్తుకెళ్లిన సంఘటనలు.. వివి ప్యాట్లను ధ్వంసం చేసిన సంఘటనలు అందరికీ తెలుసు.. అందువల్లే బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది.. భద్రతను కట్టుదిట్టం చేస్తుంటుంది.
అయితే ఈసారి మొదటి దశలో జరిగిన పోలింగ్లో బీహార్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి మొదలుపెడితే రాత్రి దాకా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉత్తమ హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈసారి ఎటువంటి హింసాయుత ఘటనలు చోటు చేసుకోలేదు. పోలీసులు.. కేంద్ర బలగాలు భారీగా మోహరించడంతో పోలింగ్ అంత ప్రశాంతంగా సాగింది. పైగా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు. వాస్తవానికి ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు. బీహార్ రాష్ట్రంలో ఇలా జరుగుతుందని అంచనా వేయలేదు. ఏది ఏమైనాప్పటికీ బీహార్ రాష్ట్రంలో తొలి దశలో 60 శాతానికి మించి పోలింగ్ నమోదవడం అక్కడి అధికారులకు ఎక్కడా లేని ఉత్సాహాన్ని కలిగించింది.
ప్రస్తుతం రెండవ దశ పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. అక్కడ విపరీతంగా చలిగాలులు వీస్తున్నప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ పరిణామం అక్కడి అధికారుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేయలేదు. పైగా చలి గాలులను సైతం లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 122 నియోజకవర్గాలలో రెండవ విడత పోలింగ్ జరుగుతోంది. మొదట విడత పోలింగ్ నవంబర్ 6న జరిగింది. నవంబర్ 14న ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం బీహార్ రాష్ట్రంలో నమోదైన పోలింగ్ 20 శాతానికి చేరువలో ఉంది.