
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడికాకున్నా.. దాదాపు డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడిగా ఖరారైంది. దీంతో ఆయన త్వరలో వైట్‌హౌస్‌లో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 6 తర్వాత వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్న బైడెన్ నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. అయితే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీ చేస్తారా లేదా అన్న చర్చ ఇప్పుడే మొదలైంది. ఏ అధ్యక్షుడు అయినా.. సెకండ్ టర్మ్‌లో బరిలోకి దిగారు. కానీ.. జో బైడెన్ ఆ అవకాశాలు తక్కువేనని వినిపిస్తోంది.
Also Read: జో బైడెన్ కన్నీటి పర్యంతం.. అమెరికాలో కరోనా తీవ్రతకు నిదర్శనమిదీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా జో బైడెన్ త్వరలో పగ్గాలు చేపట్టేందుకు సిద్ఢపడుతున్నారు. అమెరికా చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బైడెన్‌పై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే భారత ప్రధాని మోడీ సహా పలు దేశాధినేతలు బైడెన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అమెరికా అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జో బైడెన్ నాలుగేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. ఆయనకు డిప్యూటీగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ వ్యవహరించబోతున్నారు. ఆమె కూడా బైడెన్‌తో పాటు నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటారు.
అయితే.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న బైడెన్‌కు రేపటితో 78 ఏళ్లు నిండుతున్నాయి. ఆయన పదవీకాలం పూర్తి చేసుకునే 2024 నాటికి ఆయనకు 82 ఏళ్లు వస్తాయి. ఇప్పటికే వయోభారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బైడెన్ మరోసారి ఎన్నికవుతారా లేదా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమే అయినా ఈ అంశంపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. జో బైడెన్ ఎనిమిదేళ్లపాటు అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన అనుభవం ఆయనకు ఉంది. అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపడుతున్న బైడెన్‌కు ఈ బాధ్యతలు తొలిసారితో పాటు చివరి సారి కూడా కానున్నాయా అంటే మెజారిటీ విశ్లేషకులు మాత్రం అవుననే అంటున్నారు.
Also Read: క్రెడిట్ కార్డులు వాడే వాళ్లకు షాకిచ్చిన సుప్రీం కోర్టు..?
రెండోసారి అధికారం చేపడితే.. అది పూర్తయ్యే సరికి 86 ఏళ్లు నిండుతాయి. ప్రస్తుతం బైడెన్ పరిస్ధితి చూస్తుంటే ఇది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ.. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం రెండుసార్లు అధికారం చేపట్టాలనే కోరిక ఉందనే బైడెన్ సమాధానమిచ్చారు. బైడెన్‌తోపాటు ఆయన పార్టీ సభ్యులు, కుటుంబం ఇలా ప్రతి ఒక్కరూ ఆయన రెండోసారి ఎన్నిక కావడం ఖాయమనే అంచనాలోనే కనిపిస్తున్నారు.