Nandyala Politics: ఉమ్మడి కర్నూలులో నంద్యాల హాట్ సీట్. ఎంతోమంది హేమాహేమీలు ఇక్కడ రాజకీయాలు చేశారు. కానీ సుదీర్ఘకాలం భూమా నాగిరెడ్డి కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. బతికున్నంత కాలం ఆధిపత్యం భూమా నాగిరెడ్డి దే . అయితే ప్రస్తుతం ఆయన వారసులు ఇబ్బంది పడుతున్నారు. సీటు కోసం వీధిన పడుతున్నారు. దీంతో భూమా కుటుంబ చరిత్ర మసకబారుతోంది.
భూమా నాగిరెడ్డి చనిపోయేనాటికి ఆయన కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి చాలా చిన్నవారు. ప్రస్తుతం ఆయన యువకుడయ్యారు. యువరాజకీయ వేత్తగా మారారు. 2024 ఎన్నికల్లో తానే పోటీ చేయాలని భావిస్తున్నారు. నంద్యాల ఇన్చార్జ్ భూమా బ్రహ్మానంద రెడ్డితో విభేదిస్తున్నారు. దీంతో కుటుంబంలోనే ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్తిస్తున్నారు. కుటుంబ గౌరవం వీధిన పడుతోంది.
అటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సైతం ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఇటీవల చంద్రబాబు నంద్యాల సీటు విషయంలో కొంత స్పష్టతనిచ్చారు. ఇంచార్జ్ బ్రహ్మానందరెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. అది తన తండ్రి నియోజకవర్గమని.. అక్కడి నుంచి రాజకీయాలు చేయవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని తేల్చి చెప్పారు. దీంతో టిడిపి నాయకత్వంతో తాడోపేడో అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల నుంచే పోటీ చేస్తానని జగత్ విఖ్యాత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇది భూమా కుటుంబంలో రచ్చకు కారణమవుతోంది.
మరోవైపు టిడిపి సీనియర్ నేత ఫరూక్ తనకే టిక్కెట్ అని చెప్పుకొస్తున్నారు. అటు భూమా నాగిరెడ్డి అనుచరుడు ఏవి సుబ్బారెడ్డి కూడా నంద్యాల టికెట్ రేసులో ఉన్నారు. భూమా కుటుంబం ఒకవైపు.. మిగతా ఆశావహులు మరోవైపు.. టిడిపి నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా భూమా కుటుంబంలో ఎలా సర్దుబాటు చేయాలో తెలియక చంద్రబాబు మల్ల గుల్లాలు పడుతున్నారు. అందుకే మంచు మనోజ్ ను తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.