రోజాకు మంత్రి పదవిపై కోట్లలో పందేలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు నగరిపై పడ్డాయి. దీంతో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశముంటుంది. అందుకే వైసీపీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రకాల ఆలోచనలు పుడుతున్నాయ. మంత్రివర్గంలో చోటు కోసం నగరి ఎమ్మెల్యే రోజా కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి ఖాయమని ఓక వర్గం చెబుతుండగా ఆమె రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటే అనుమానాలే అనే విషయాలు […]

Written By: Srinivas, Updated On : July 27, 2021 10:04 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు నగరిపై పడ్డాయి. దీంతో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశముంటుంది. అందుకే వైసీపీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రకాల ఆలోచనలు పుడుతున్నాయ. మంత్రివర్గంలో చోటు కోసం నగరి ఎమ్మెల్యే రోజా కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి ఖాయమని ఓక వర్గం చెబుతుండగా ఆమె రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటే అనుమానాలే అనే విషయాలు చర్చకు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఉండడంతో జంట పదవుల కారణంతో ఆమెకు పదవి దొరుకుతుందో లేదో అనే సందేహాలు పలువురిలో నెలకొంటున్నాయి. దీంతో వైసీపీలో కొందరు నేతలు మాత్రం విధేయతకు పట్టం కడితే రోజాకు మంత్రి పదవి దక్కడం సముచితమే అనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి విస్తరణలో ఆమెకు పదవి వస్తుందనే ఆశాభావం అందరిలో నెలకొంది. కేబినెట్ లో చోటు కోసం రోజా కూడా సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్టాడడంలో రోజా దిట్ట. తన పదునైన వాగ్బాణాలతో టీడీపీని చిత్తు చేసి వారిలో బలాన్ని తగ్గించేలా చేసిన రోజాపై జగన్ కు కూడా మంచి అభిప్రాయమే ఉంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజాకు మంత్రి పదవి ఇస్తేనే సముచిత స్థానం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఆ దిశగా సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. రోజాకు మంత్ర పదవి వస్తుందా? రాదా? అనే విషయాలపై కోట్లలో బెట్టింగులు సైతం జరగడం విశేషం.

ఇక సామాజికవర్గం విషయానికి వస్తే రోజా ఇప్పటికే సినీనటిగా, రాజకీయ నాయకురాలుగా తన ప్రభావాన్ని చూపెడుతున్నారు. దీంతో ఆమె సామాజికవర్గంపై ఎందుకు అనుమానాలు అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. ఆమె అందరికి సుపరిచిరాలు కావడంతో మంత్రి పదవి విషయంలో ఇవన్ని నిబంధనలు పట్టించుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈసారి రోజాకు మంత్రి పదవి ఖాయమనే విషయం అందరిలో స్పష్టంగా వినిపిస్తోంది.