
జాతీయ దిగ్గజ మీడియా ఇండియా టుడే తాజాగా సర్వే నిర్వహించింది. ఇండియాలోనే అత్యుత్తమ సీఎంలు ఎవరన్న దానిపై శూలశోధన చేపట్టింది. ఏడాదిన్నర వరకూ బెస్ట్ సీఎంలలో ఉన్న ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ర్యాంకు తాజాగా పడిపోయింది.
ఇండియాలో బెస్ట్ సీఎం ఎవరు? అంటూ ఇండియా టుడే జాతీయ మీడియా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’(mood of the nation) పోల్ ఆగస్టు 2021ను తాజాగా నిర్వహించింది. ఇందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెనుకబడ్డారు. ఈ పోల్ లో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.
ఇటీవలే తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్న స్టాలిన్ దేశంలో అందరికంటే ముందున్నారు. ఆయనే అత్యుత్తమ పాలన అందిస్తున్నారని ఏకంగా 42శాతం మంది ప్రజలు దేశంలో ‘బెస్ట్ సీఎం’ అవార్డును స్టాలిన్ కు కట్టబెట్టడం విశేషం.
ఇక ఆ తర్వాత స్థానాల్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో.. కేరళ సీఎం విజయన్ 3వ స్థానంలో.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే 4వ స్థానంలో.. బెంగాల్ సీఎం మమత 5వ స్థానంలో నిలిచారు. వీరంతా 30శాతానికి పైగా రేటింగ్ తెచ్చుకోవడం వివేషం.
ఇక ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ,జార్ఖండ్, చత్తీస్ ఘడ్ సీఎంలున్నారు. ఏపీ సీఎం జగన్ కు 19శాతం కన్నా తక్కువ ఫలితాలు రావడంతో ఆయన స్థానం పడిపోయింది. గత సంవత్సరం టాప్ లో ఉన్న జగన్ ఈసారి వెనుకబడిపోయారు.
ఇక ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. మోడీకి ఆదరణ 66శాతం నుంచి 24శాతానికి పడిపోయింది. దీనితంటికి కారణం కరోనా పరిస్థితులే.. ఏ ముఖ్యమంత్రి కూడా 50శాతం ప్రజల ఆదరణ చూరగొనలేకపోవడం గమనార్హం.