Homeజాతీయ వార్తలుBengaluru Rent Crisis : అక్కడ అద్దె చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి..

Bengaluru Rent Crisis : అక్కడ అద్దె చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి..

Bengaluru Rent Crisis : మన దేశ ఐటీ రాజధానిగా బెంగళూరు నగరానికి పేరు ఉంది. దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయ సంస్థలు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అందువల్లే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. భారీగా నివాస సముదాయాలు నిర్మాణమయ్యాయి. దీనికి తోడు భారీగా వేతనాలు ఐటి పరిశ్రమలో లభిస్తున్న నేపథ్యంలో చాలామంది.. బెంగళూరు నగరంలో స్థిరపడ్డారు.

దేశంలోని ఇతర ప్రాంతాల వారు మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది బెంగళూరు నగరానికి వెళ్లారు. వారంత కూడా అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. జనం భారీగా రావడంతో బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పెరిగిపోయింది. బెంగళూరు మాత్రమే కాకుండా.. దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ధరలు భారీగా పెరగడం.. జీవన వ్యయం అంచనాలకు అందకుండా ఉండడంతో చాలామంది బెంగళూరు ముద్దు అనే స్థాయి నుంచి.. బెంగళూరు అసలు వద్దు అనే స్థాయికి పరిమితమయ్యారు.

బెంగళూరు నగరంలో పర్యావరణం బాగుంటుంది. వాతావరణం అద్భుతంగా ఉంటుంది. పైగా ఐటీ పరిశ్రమలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం లభించిన వారికి.. నివాసం కచ్చితంగా కావాలి. అందువల్లే అద్దె ఇంటి కోసం అక్కడ తిరిగే వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అద్దెకు గృహాలు లభించడం లేదు. ఒకవేళ అద్దెకు గృహాలు దొరికినప్పటికీ.. కిరాయి ఒక రేంజ్ లో ఉంది. ఆ కిరాయి చూస్తే గుండె అదిరిపోతుంది అందువల్ల చాలామంది బెంగళూరు నగరాన్ని వదిలి రావడానికి సిద్ధపడుతున్నారు.

రెంట్ భారీగా ఉన్నప్పటికీ.. చెల్లించడానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. అయితే నివాస గృహాల యజమానులు ముందస్తుగా కొంతమేర చెల్లించాలని కండిషన్ పెడుతున్నారు. అలా ముందస్తుగా చెల్లించాల్సిన అడ్వాన్స్ లక్షలో ఉండడంతో చాలామంది భయపడిపోతున్నారు. ఉదాహరణకు ఒక ఇంటి 20000 ఉంది అనుకుంటే.. అందులో చేరడానికి ముందే 10 నెలల అడ్వాన్స్ కట్టాలని గృహాల యజమానులు షరతు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక ప్రభుత్వాన్ని కో కంపెనీ కలిసింది. తమ ఉద్యోగులు అద్దె చెల్లించలేక పడుతున్న ఇబ్బందిని విన్నవించింది.. ఇలా అయితే బెంగళూరులో ఎవరూ ఉండరని ఆ కంపెనీ చెప్పింది. గృహాల యజమానులు సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. దోచుకుంటున్నారని ఆ కంపెనీ మండిపడింది.. ఆ కంపెనీ ప్రతినిధుల మాటలు విన్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

బెంగళూరు నగరంలో కొంతకాలంగా అధ్యలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మిడిల్ క్లాస్ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు నగరంలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్.. కోరమంగళ.. బెల్లందుర్.. మార్తహళ్లి, వైట్ ఫీల్డ్.. ఎలక్ట్రానిక్ సిటీ.. సర్జాపూర్ రోడ్డు ప్రాంతాలలో హద్దులు విపరీతంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో నివాసం ఉండాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు. 500 చదరపు అడుగులు ఉన్న సింగిల్ బెడ్ రూమ్ కు 30 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ కు 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. త్రిబుల్ బెడ్ రూమ్ అయితే ఏకంగా 70 వేల వరకు ఉంది. ఇండిపెండెంట్ ఇల్లు లేదా విల్లా అయితే ఏకంగా నాలుగు లక్షల వరకు ఉంది. ఈ స్థాయిలో రెంట్ చెల్లించిన తర్వాత.. ఏ ఉద్యోగికి కూడా జేబులో రూపాయి మిగలడం లేదు. దీనికి తోడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా భారీగా వసూలు చేస్తున్న నేపథ్యంలో.. చాలామంది బెంగళూరు నగరాన్ని విడిచి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version