
మహానాడులో భాగంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెబినార్ ద్వారా ప్రసంగించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశామని ఆయన చెప్పారు. జంట నగరాలకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించాం అని ఆయన చెప్పారు. అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించామని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశామని ఆయన తెలిపారు. టిడిపి హయాంలో చేపట్టిన పథకాలు దేశానికి మార్గదర్శకం అయ్యాయని ఆయన తెలిపారు. కార్యకర్తల త్యాగాలు జీవితంలో మర్చి పోలేనని ఆయన చెప్పారు.గత ఏడాది దురదృష్టకర సంవత్సరమని ఆయన చెప్పారు. శారీరకంగా మానసికంగా, ఆర్థికంగా కార్యర్తలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. చేయని తప్పుకు టిడిపి కార్యకర్తలు జైలుకు వెళ్లారని చంద్రబాబు ఆరోపించారు.