Homeజాతీయ వార్తలుBasanagouda Patil Yatnal controversy: ఎమ్మెల్యేగారు.. పిచ్చిమాటలెందుకు?

Basanagouda Patil Yatnal controversy: ఎమ్మెల్యేగారు.. పిచ్చిమాటలెందుకు?

Basanagouda Patil Yatnal controversy: బీజేపీ అంటే ఒక హిందుత్వ పార్టీ అనే ముద్ర ఇప్పటికే పడిపోయింది. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. కానీ ఎవరూ ఇతర మతాలను కించపర్చడం లేదు. కానీ ప్రజల ఓట్లతో గెలిచినవారు మాత్రం ఇతర మతాలను కించపరుస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వివాదాస్పదమవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్‌ యత్నాల్, ముస్లిం యువతులను వివాహం చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, సామాజిక సంఘర్షణకు దారితీస్తాయని విమర్శలు వెల్లువెత్తాయి.

కర్ణాటకలోని కొప్పళ జిల్లాలో గవిసిద్ధప్ప అనే హిందూ యువకుడు ముస్లిం యువతిని ప్రేమించాడు. ఇటీవల హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత యత్నాల్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బసంగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో, కొందరు ముస్లిం యువకులు యత్నాల్‌ కాన్వాయ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు, దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

మత సామరస్యంపై దెబ్బ
యత్నాల్‌ వ్యాఖ్యలు హిందూ–ముస్లిం సంఘాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. మతం ఆధారంగా వివాహాలను ప్రోత్సహించడం, ఆర్థిక ప్రలోభాలు ప్రకటించడం వంటివి మత సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన మహిళలను రాజకీయ ఆయుధంగా ఉపయోగించే ప్రమాదాన్ని సూచిస్తోంది. మహిళల వివాహాలను రాజకీయ అజెండాగా మార్చడంపై మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. యత్నాల్‌ వ్యాఖ్యలను కొందరు హిందూత్వ ఎజెండా ప్రచారంగా భావిస్తున్నారు. విపక్ష నాయకులు ఈ వ్యాఖ్యలను రాష్ట్రంలో శాంతిని భగ్నం చేసే చర్యగా అభివర్ణించారు.

Also Read: 24 గంటల్లో అంతటి వాన.. ముంబైలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..

శాంతి భద్రతలకు విఘాతం..
మత సామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చట్టపరంగా నేరంగా పరిగణించబడతాయి. అయితే, యత్నాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం వివాదానికి కారణమైంది. కాన్వాయ్‌పై దాడి ప్రయత్నం వంటి ఘటనలు శాంతి భద్రతలకు సవాలుగా మారాయి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చట్టం, సువ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలు మత, రాజకీయ విభజనను పెంచడమే కాకుండా, సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తాయి. బసంగౌడ పాటిల్‌ యత్నాల్‌ వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా, సమాజంలో విభజనలను సృష్టించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version