Bandi Sanjay ‘Praja Sangrama Yatra’: పాతబస్తీలో దుమ్ము దుమారం.. ‘బండి’ కదిలింది..

Bandi Sanjay ‘Praja Sangrama Yatra’ ‘పాతబస్తీలో దుమ్ము దుమారం’ పేరిట ‘దంచికొట్టిండో..దుమ్మురేపిండో’ ప్రోమోను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విడుదల చేశారు. రాహుల్ సిప్లిగంజ్ స్వరకల్పనతో పాడిన ఈ పాటతో ఇప్పుడు వైరల్ అయ్యింది. యువతను ఉర్రూతలూగిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 14 నుంచి ప్రారంభించనున్న రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించి ‘పాతబస్తీలో దుమ్ము దుమారం’ పేరిట రూపొందించిన స్పెషల్ సాంగ్ ప్రోమో […]

Written By: NARESH, Updated On : April 2, 2022 5:28 pm
Follow us on

Bandi Sanjay ‘Praja Sangrama Yatra’ ‘పాతబస్తీలో దుమ్ము దుమారం’ పేరిట ‘దంచికొట్టిండో..దుమ్మురేపిండో’ ప్రోమోను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విడుదల చేశారు. రాహుల్ సిప్లిగంజ్ స్వరకల్పనతో పాడిన ఈ పాటతో ఇప్పుడు వైరల్ అయ్యింది. యువతను ఉర్రూతలూగిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 14 నుంచి ప్రారంభించనున్న రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించి ‘పాతబస్తీలో దుమ్ము దుమారం’ పేరిట రూపొందించిన స్పెషల్ సాంగ్ ప్రోమో దుమ్ము రేపుతోంది. ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘దంచి కొట్టిండో…. దద్దరిల్లిందో’ అనే పాట ప్రోమో ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలతో కలిసి ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ ‘స్పెషల్ సాంగ్ ’ ప్రోమోను విడుదల చేశారు. ప్రముఖ రచయిత, బండి సంజయ్ వీరాభిమాని ఆకుల నాగేశ్వరరావు రచించిన ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి టీం సభ్యుడైన జీవన్ సంగీత దర్శకత్వం వహించారు.

మొదటి విడత పాదయాత్ర సక్సెస్, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద బీజేపీ నిర్వహించిన సభతో పాతబస్తీ కాషాయమయమైన తీరు, బండి సంజయ్ ధైర్యసాహసాలు, హిందుత్వ నేపథ్యాన్ని ఉటంకిస్తూ నాగేశ్వర్ రావు రూపొందించిన ఈ పాట విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో విజయవంతమైన పాటల్లో మెజారిటీ దాదాపు నాగేశ్వరరావు కలం నుండి జాలు వారినవే కావడం విశేషం. తొలివిడత పాదయాత్ర సక్సెస్ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో నాగేశ్వరరావు కలం నుండి జాలు వారిన ఈ పాటకు ఈసారి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ ఇవ్వడంతో మరింత మాస్ లుక్ వచ్చింది.

స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను చేరుకోవడం విశేషం.