Bandi Sanjay: ధాన్యం కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తప్పు మీదంటే మీదని దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రైతుల సమస్యల మాట దేవుడెరుగు వారి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత వారి మధ్య ఇంకా అగాధం పెరిగింది. దీంతో రెండు పార్టీలు రైతులే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలుపై విరుచుకుపడుతున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ టీఆర్ఎస్ ను మట్టికరిపించింది. ఈటల రాజేందర్ బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ పై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట పెరిగింది. రాష్ర్టంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ ప్రకటించుకుంటున్న తరుణంలో ఫలితాలు కూడా అదే విధంగా వస్తుండటంతో టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీని టార్గెట్ చేసి అదుపు చేయాలని భావించింది. ఇందులో భాగంగానే విమర్శలకు దిగుతోంది.
Also Read: వడ్ల విషయంలో ‘బండి’కి బ్రేకులెలా వేయాలి.. తలపట్టుకుంటున్న టీఆర్ఎస్
ప్రభుత్వం బీజేపీపై అక్కసుతోనే దాడులకు తెగబడుతోందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల ముసుగులో వచ్చి దాడులకు తెగబడటం ఏమిటని ప్రశ్నించారు. అయినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ పై పోరు సాగుతుందని పేర్కొన్నారు. పోలీసులు సైతం వారికి వత్తాసు పలకడం దారుణమన్నారు.
కేసీఆర్ పై రైతుల్లో నానాటికి కోపం పెరిగిపోతోంది. వారి పట్ల కపట ప్రేమ కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవేమీ బీజేపీని నిలువరించవని బండి సంజయ్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడతారని తెలుస్తోంది. దీని కోసమే బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.
Also Read: పెరుగుతున్న రాజకీయ వేడి.. బండి సంజయ్ మరో యాత్ర..