ఆ ఘటనపై విచారణ చేపట్టాలని సంజయ్ డిమాండ్!

సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ లో పేలుడు సంభవించి నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైవిచారణ చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. సింగరేణిలో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలేయడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణిలో […]

Written By: Neelambaram, Updated On : June 3, 2020 7:39 pm
Follow us on

సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ లో పేలుడు సంభవించి నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైవిచారణ చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.

సింగరేణిలో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలేయడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణిలో అధికారులకు ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారని ఆరోపించారు. సింగరేణి అధికారులు కాంట్రాక్టులు కేటాయించి పనులపై పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.