Jr NTR: “ఈ సీమ కోసం నా తండ్రి, నా భర్త, నా కుమారులు చనిపోయారు. మీలో ఎవరైనా ఈ నాయకత్వాన్ని అందుకోండి” అంటూ ఓ వృద్ధురాలు కోరితే అందరూ సంశయిస్తారు. కానీ ఓ పదేళ్ల బాలుడు నేనున్నానని నాయనమ్మ అంటూ ముందుకొస్తాడు. ఆ మధ్యన చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో డైలాగు ఇది. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అధినేత చంద్రబాబు జైలులో బందీగా మారారు. కుమారుడు ఢిల్లీలో ఉన్నాడు. భార్య, కోడలు పోరాడుతున్నారు. ఈ సమయంలోనే బలమైన నాయకత్వాన్ని పార్టీ కేడర్ కోరుకుంటుంది. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తోంది.
అయితే చంద్రబాబు బందీగా మారి మూడు వారాలు దాటుతున్నా.. ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ కానీ.. ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కానీ.. కనీసం స్పందించలేదు. మామయ్యకు మద్దతుగా ట్విట్టర్లో కూడా పలకరించలేదు. అయితే తెలుగుదేశం పార్టీపై అభిమానం ఉన్నవారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చర్యలను తప్పుపడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ మాత్రం తారక్ చర్యలను వెనుకేసుకొస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలని తిరిగి ప్రశ్నిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయకత్వానికి ఇష్టపడే టిడిపి శ్రేణులు మాత్రంతారక్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ఈ స్థితికి కారణం తారక్ అని నిందిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టిడిపి అభిమానులకు, తారక్ ఫ్యాన్స్ కు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ చేసిన కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే పార్టీకి లాభం కలుగుతుందా? లేకుంటే నష్టమా? అంటూ ఓ ఇంటర్వ్యూలో శ్రీ భరత్ కి ప్రశ్న ఎదురైంది. పార్టీకి ఆయన వల్ల ఒరిగేదేమీ లేదని శ్రీ భరత్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. అయితే అప్పట్లో శ్రీ భరత్ పై తారక్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు టిడిపి క్లిష్ట సమయంలో ఉండడంతో.. శ్రీ భరత్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు నేను అన్నది తప్పు కాదు.. నేను చెప్పిన విధానమే తప్పుఅని శ్రీ భరత్ చెప్పుకొస్తున్నారు.పార్టీ బలపడాలి అంటే ఒక వ్యక్తి వల్ల అయ్యేది కాదు.. అందరూ కలిస్తేనే అది సాధ్యమనితన అభిప్రాయంగా చెప్పుకొస్తున్నారు.మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలతో తారక్ ప్రస్తావన వస్తుండడం విశేషం.