Pattabhi: జగన్ ను బూతులు తిట్టిన పట్టాభి.. ఇక ఊపిరి పీల్చుకో!

Pattabhi:ఏపీ సీఎం జగన్ పై బూతులు తిట్టిన టీడీపీ అధికార ప్రతినిధికి ఎట్టకేలకు ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది. జగన్ ను తిట్టినందుకు తొలుత అరెస్ట్ అయిన పట్టాభికి స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో మచిలీపట్నం జైలుకు పంపారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే పట్టాభిరామ్ హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా పట్టాభిరామ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభిరామ్ ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. సీఎం జగన్ పై […]

Written By: NARESH, Updated On : October 23, 2021 4:49 pm
Follow us on

Pattabhi:ఏపీ సీఎం జగన్ పై బూతులు తిట్టిన టీడీపీ అధికార ప్రతినిధికి ఎట్టకేలకు ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది. జగన్ ను తిట్టినందుకు తొలుత అరెస్ట్ అయిన పట్టాభికి స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో మచిలీపట్నం జైలుకు పంపారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు.

pattabhi arresti

ఈ క్రమంలోనే పట్టాభిరామ్ హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా పట్టాభిరామ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభిరామ్ ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ గవర్నర్ పేట పోలీసులు పట్టాభిని కోర్టులో హాజరుపరిచారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153(ఏ), 505(2), 353, 504 రెడ్ విత్ 120(బి) కింద కేసులు నమోదు చేశారు. ఇక విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రో పాలిటిన్ కోర్టులో ప్రవేశపెట్టారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు.అయితే బెయిల్ నిరాకరించింది.

తాజాగా టీడీపీ నేతలు పట్టాభిపై హైకోర్టుకు ఎక్కగా అక్కడ ఊరట లభించింది.