బాహుబలి లెక్కలు తీస్తాం: సినీ నిర్మాతలను ఏపీ సర్కార్ బెదిరిస్తోందా?

పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత హైప్ వచ్చినా అవి ఒక వారం తర్వాత కొన్ని ఆడలేదు. కొన్ని ఆడినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీని వేరే లెవల్ కు తీసుకెళ్లిన బాహుబలి మూవీ గ్రాండ్ హిట్. ఏకంగా ఒక్క సీటు ఖాళీ లేకుండా థియేటర్లు అన్నీ నిండిపోయాయి. నెలరోజుల పాటు ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారు. దీని కలెక్షన్లు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ఐదారు వందల కోట్లు వచ్చినట్టు భోగట్టా.. ప్రపంచవ్యాప్తంగా […]

Written By: NARESH, Updated On : September 28, 2021 4:15 pm
Follow us on

పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత హైప్ వచ్చినా అవి ఒక వారం తర్వాత కొన్ని ఆడలేదు. కొన్ని ఆడినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీని వేరే లెవల్ కు తీసుకెళ్లిన బాహుబలి మూవీ గ్రాండ్ హిట్. ఏకంగా ఒక్క సీటు ఖాళీ లేకుండా థియేటర్లు అన్నీ నిండిపోయాయి. నెలరోజుల పాటు ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారు. దీని కలెక్షన్లు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ఐదారు వందల కోట్లు వచ్చినట్టు భోగట్టా.. ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లు వచ్చాయని ప్రకటించారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రాజేసిన వివాదంలో ఆయన మద్దతుగా నిలుస్తున్న సినీ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఏపీ ప్రభుత్వం. సినీ ఇండస్ట్రీ విషయంలో పవన్ కళ్యాణ్ ను ఒంటరిని చేసే ప్రయత్నం చేపట్టింది. ఆయనకు మద్దతు పెరగకుండా సరైన స్కెచ్ గీసింది.

ఆన్ లైన్ టికెటింగ్ ఎంత అవసరమో వివరిస్తూ ‘బాహుబలి కలెక్షన్ల అంశాన్ని’ తాజాగా తెరపైకి తీసుకొచ్చారు. బాహుబలి సినిమాకు నెలరోజుల వరకూ హౌస్ ఫుల్ కలెక్షన్లు ఉంటే తొలి వారం 50శాతం మాత్రమే టికెట్లు బుక్ అయినట్టు చూపారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ కలెక్షన్లు దాచేస్తే అంతకంటే ఘోరం మరొకటి లేదని ఆయన వ్యాఖ్యానించడం కాకరేపుతోంది. బాహుబలి టికెట్ల అంశంపై మరోసారి చెక్ చేయాలని అనడం సినీ నిర్మాతల్లో గుబులు రేపుతోంది.

బాహుబలి మొదటి వారంలో ఎంత బాగా నడిచిందో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అసలు టికెట్లే దొరకలేదు. అంత పెద్ద సినిమాకు తొలి వారం సగం టికెట్లే అమ్మినట్లు చూపడం నిజంగా మోసం చేయడమేనని సజ్జల చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.

సినిమా థియేటర్లు అన్నీ బడా నిర్మాతల చేతుల్లోనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వాళ్లే ఈ కలెక్షన్లను సగం చేసి చూపించి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టారన్నది సజ్జల ఆరోపణ.. ఇప్పుడు దాన్ని తవ్వితీస్తే అన్ని హిట్ సినిమాలవి తీయాల్సి ఉంటుంది. అదే జరిగితే పన్నులు ఎగ్గొట్టిన నిర్మాతలు అంతా చిక్కుల్లో పడుతారు.

సో బాహుబలి మూవీ టికెట్ల లెక్కలు తీసి పరోక్షంగా ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని బెదిరిస్తున్నట్టుగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సినీ నిర్మాతలు, ప్రముఖులు మద్దతు తెలుపకుండా ఇలా ఏపీ ప్రభుత్వం కౌంటర్ ప్లాన్ రెడీ చేసి ఉంటారని తెలుస్తోంది.