Chandrababu: ఏపీలో రాజకీయ వాతావరణం అప్పుడే బాగా హీటెక్కింది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ అప్పుడే రాజకీయ పార్టీల పొత్తు విషయం తెరమీదకు వచ్చింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ద్వారా ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకుగాను ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలనే చంద్రబాబు నాయుడు పిలుపు, వన్ సైడ్ లవ్ ఉండదని వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమవుతున్నాయి.
మొత్తంగా జగన్ ను ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు కనబడుతున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో అనగా 2014 ఎన్నికల మాదిరిగా ఎన్నికల ముందరనే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బాబు ప్లాన్ చేస్తున్నట్లు కనబడుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు కలిసి రావాలని పదే పదే బాబు పిలుపునిస్తున్నట్లుంది.
2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత ఎప్పుడూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను రకరకాల ఎత్తుగడలు అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. అన్ని నియోజకవర్గాలకు ఇప్పుడే ఇన్‌చార్జిలను నియమించాలని బాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టు నిలుపుకుని ఆ తర్వాత పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని బాబు అనుకుంటున్నారట.
Also Read: Jagan Decision: జగన్ నిర్ణయం.. వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులు నిష్క్రమణ
ఈ క్రమంలోనే సరికొత్త రాజకీయ సమీకరణాలను ఫాలో అవుతున్నారట బాబు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని టీడీపీ శ్రేణులు, కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ బాబు వాటిపైన పెద్దగా స్పందించలేదు. అయితే, తాజాగా జనసేనతో పొత్తు గురించి మాత్రం స్పందించారు. లవ్ వన్ సైడ్ ఉండొద్దని అన్నారు. అలా జనసేనానితో పొత్తుకు సంకేతాలు ఇవ్వకనే ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి క్రియాశీలక సభ్యుడిగా ఆహ్మానించడం కంటే కూడా జనసేనాని పవన్ కల్యాణ్‌తో పొత్తుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారనే చర్చ జరుగుతున్నది. చూడాలి మరి.. అప్పటి వరకు ఏం జరుగుతుందో..
Also Read: Chandrababu: పొత్తుల ఎత్తులు.. 2024లో చంద్రబాబు ప్లాన్ బి ఇదే