Cabs And Lorry Services Closed: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్ వాహనాల చట్టం 2019 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న జరిమానాలకు నిరసనగా బుధవారం హైదరాబాద్ నగరంలో ఒక రోజు క్యాబ్ లు, ఆటోలు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. నూతన చట్టం పేరుతో ప్రభుత్వం డ్రైవర్లను దోచుకునేందుకు సిద్ధమవుతోంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న డ్రైవర్లకు నూతన చట్టం గుదిబండగా మారనుంది. డ్రైవర్లను నిలువు దోపిడీ చేసేందుకు తయారుగా ఉండటంతో వాహనాల జేఏసీ ఆధ్వర్యంలో బందుకు పిలుపునిచ్చింది.

ఫిట్ నెస్, లేట్ ీజు పేరుతో రోజుకు రూ. 50 లు జరిమానాగా విధించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంపై జేఏసీ మండిపడుతోంది. పెరిగిన పెట్రో ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జరిమానాలు విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పెట్రో భారతంతోనే సతమతమవుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ప్రభుత్వం ఇలా చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి.
Also Read: AP Unemployment: ఉద్యోగాలెక్కడ జగనన్న.. ఏపీ సర్కారుపై నిరుద్యోగ యువత ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ట్రావెల్ భవన్ ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. ఖైరతాబాద్ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించింది. వెహికల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ విపరీతంగా పెరిగిపోవడంతో వాహనాలు నడపడమే కష్టంగా మారుతున్నందున డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఒక్కో వాహనంపై రూ. 50 జరిమానా విధించడంతో ఇక తామెలా బతికేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో డ్రైవర్లలో ఆందోళన నెలకొంది. కరోనా కష్టకాలంలో నష్టాలే చవిచూసినా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమపై జరిమానాల పేరుతో ప్రభుత్వం విరుచుకుపడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ల ఆర్థిక స్తితిగతులు అర్థం చేసుకోకుండా ఇలా ఫైన్ల రూపంలో వసూలు చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
బుధవారం ఒక్కరోజు వాహనాల బంద్ తో రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంటుందా? డ్రైవర్ల డిమాండ్లు తీరుస్తుందా? అనే ఆలోచనలు వస్తున్నాయి. జంట నగరాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లే వారు మరో మార్గం చూసుకోవాల్సిందే. మొత్తానికి వాహనాల డ్రైవర్లు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం దిగి వస్తుందా? లేక మొండితనంతోనే ప్రవర్తిస్తుందో తెలియడం లేదు.
Also Read:Amanchi Krishna Mohan: జనసేన వైపు ఆమంచి క్రిష్ణమోహన్ చూపు.. రకారకాల ఆఫర్లతో కట్టడి చేస్తున్న జగన్
Recommended Videos