https://oktelugu.com/

NTR Family: ఎన్టీఆర్ కుటుంబానికి ‘ఆగస్టు’ శాపం.. ఈనెలలో వారింట మరణాలు ఎందుకు? ఏమిటి కారణం?

NTR Family: దివంగత ముఖ్యమంత్రి.. అన్నగారు అని ముద్దుగా పిలిచే నందమూరి తారకరామరావు కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం నందమూరి ఫ్యామిలీలో విషాదం నింపింది. చంద్రబాబు నుంచి మొదలుపెడితే బాలకృష్ణ, రామకృష్ణ అందరి కుటుంబాలు తరలివచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. నందమూరి కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అన్న నందమూరి కుటుంబానికి ఓ శాపంలా ‘ఆగస్టు మాసం’ తయారైందనే చెప్పాలి. ఎందుకంటే వారింట జరిగే అతిపెద్ద విషాదాలన్నీ కూడా […]

Written By: , Updated On : August 1, 2022 / 11:10 PM IST
NTR Family

NTR Family

Follow us on

NTR Family: దివంగత ముఖ్యమంత్రి.. అన్నగారు అని ముద్దుగా పిలిచే నందమూరి తారకరామరావు కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం నందమూరి ఫ్యామిలీలో విషాదం నింపింది. చంద్రబాబు నుంచి మొదలుపెడితే బాలకృష్ణ, రామకృష్ణ అందరి కుటుంబాలు తరలివచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. నందమూరి కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

అన్న నందమూరి కుటుంబానికి ఓ శాపంలా ‘ఆగస్టు మాసం’ తయారైందనే చెప్పాలి. ఎందుకంటే వారింట జరిగే అతిపెద్ద విషాదాలన్నీ కూడా ఆగస్టు మాసంలోనే చోటుచేసుకున్నాయి. చరిత్రలో ఇదో తీరని విషాదంగా మారింది. ఆగస్టు మాసం ఎన్టీఆర్ ఫ్యామిలీకి అచ్చిరాదనే చర్చ సాగుతోంది.

* అన్న నందమూరి ఎన్టీఆర్ జీవితానికి ఆగస్టు మాసానికి చెరిగిపోని అనుబంధం ఉంది. ఎన్టీఆర్ ను రాజకీయంగా చావు దెబ్బ తీసింది ఆగస్టు మాసమే..ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల ఏమాత్రం కలిసిరాలేదు. ఆగస్టు 1984లో ఎన్టీఆర్ ను గద్దెదించి నాదెండ్ల భాస్కర్ రావు అనైతికంగా సీఎం అయ్యారు.

* ఇక 1995లో మరోసారి ఎన్టీఆర్ ను ఇదే ఆగస్టు నెలలో ఆయన సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను పెట్టి మరీ సీఎం కుర్చీలోంచి దించాడు. వైస్రాయ్ స్కెచ్ కు ఈ ఆగస్టు నెలలోనే జరిగింది.

*ఎన్టీఆర్ నాలుగో కుమారుడు హరికృష్ణ కూడా మూడేళ్ల కిందట 2019 ఆగస్టు 29న నెల్లూరులో పెళ్లికి కారులో వెళుతుండగా ప్రమాదంలో మరణించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ అన్న నందమూరి జానకీరాం కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

*ఎన్టీఆర్ కు ఎనిమిది మంది కుమారులు, నలుగురు కూతుళ్లు. మొదటి కొడుకు రామకృష్ణ 10ఏళ్ల వయసులోనే మసూచీతో చనిపోయాడు. ఆ తర్వాత ఏడోసంతానానికి రామకృష్ణ అని ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇక ఎన్టీఆర్ మూడో కుమారుడు సాయికృష్ణ మరణించడం నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపింది.

*ఇక ఈరోజు ఉమా మహేశ్వరి కూడా ఆగస్టు నెలలోనే చనిపోయారు. ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఆరోగ్య కారణాలు.., మానసిక ఒత్తిడి, ఒంటరితనంతో చనిపోయారని వార్తలు వచ్చాయి.

ఇలా అన్న ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆగస్టు కబళిస్తోంది. ఆ కుటుంబంలోని చాలా మంది ఈ ఆగస్టులోనే చనిపోయారు. ఈ ఆగస్టు నెల నందమూరి ఫ్యామిలీకి కలిసిరాలేదని చర్చ ఇప్పుడు సాగుతోంది.