https://oktelugu.com/

Viveka Murder Case: వివేకా కేసు కావాలనే ఆపుతున్నారా? ట్విస్ట్ ల మీద ట్విస్టులు

Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గతానికి భిన్నంగా సీబీఐ శరవేగంగా పావులు కదుపుతోంది. అనుమానితులు, కీలక నిందితులుగా భావిస్తున్నవారిని విచారణ చేపడుతోంది. అదే సమయంలో అనుమానితులు, నిందితులు న్యాయస్థానంలో పిటీషన్లు వేస్తున్నారు. దర్యాప్తు తీరుపై ఒకరు, దర్యాప్తు అధికారిపై మరొకరు, అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఇంకొకరు, ఇలా పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. దీంతో అరెస్టులుంటాయన్న కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా దేశ అత్యున్నత […]

Written By:
  • Dharma
  • , Updated On : March 21, 2023 / 09:51 AM IST
    Follow us on

    Viveka Murder Case

    Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గతానికి భిన్నంగా సీబీఐ శరవేగంగా పావులు కదుపుతోంది. అనుమానితులు, కీలక నిందితులుగా భావిస్తున్నవారిని విచారణ చేపడుతోంది. అదే సమయంలో అనుమానితులు, నిందితులు న్యాయస్థానంలో పిటీషన్లు వేస్తున్నారు. దర్యాప్తు తీరుపై ఒకరు, దర్యాప్తు అధికారిపై మరొకరు, అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఇంకొకరు, ఇలా పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. దీంతో అరెస్టులుంటాయన్న కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కేసు విచారణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. కేసు విచారణ అధికారి మార్పు విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

    వివేకా హత్యకేసులో శివశంకర్ రెడ్డి కీలక నిందుతుడు. ఆయన భార్య తులసమ్మ సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారిని మార్చే విషయంలో సీబీఐ డైరక్టర్ అభిప్రాయం తెలుసుకుని చెప్పాలని సీబీఐ లాయర్‌ను ఆదేశించింది. అసలేం జరిగిందంటే…కేసు విచారణలో ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ పురోగతిని సీల్డ్ కవర్‌లో అందచేయాలని ఆదేశించింది. కేసు విచారణను దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయడం లేదని… వివేకా హత్య కేసు విచారణను త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై సీబీఐ డైరక్టర్‌ అభిప్రాయం తెలుసుకుని చెప్పారని సీబీఐ తరపు లాయర్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

    Viveka Murder Case

    అయితే దీనిపై సీబీఐ లాయర్ విచారణ అధికారి సక్రమంగానే దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవానికి ఈ కేసు విషయంలో ఆది నుంచి సీబీఐ అధికారులు రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏపీ పరిధిలో ఉన్నప్పుడు ఏకంగా విచారణ అధికారులకే బెదిరింపులు వచ్చాయి. ఒక విధంగా సీబీఐ సవాల్ గా తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. అటు వివేకా కుమార్తె సునీత గట్టి పోరాటం చేయడంతో కేసును తెలంగాణలోకి మార్చారు. అప్పటి నుంచి కేసు పురోగతి పెరుగుతూ వచ్చింది. కీలక వ్యక్తుల అరెస్టులుంటాయని కూడా ప్రచారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విచారణ అధికారిగా ఉన్న సీబీఐ ఎస్పీ రాంసింగ్ ను టార్గెట్ చేసుకుంటూ వరుస పిటీషన్లు దాఖలవుతున్నాయి.

    మరోవైపు కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో తమను నేరస్థులుగా ఎలా సీబీఐ పరిగణిస్తుందని ప్రశ్నిస్తూ పిటీషన్ వేశారు. ఇప్పటికే తనపై కఠిన చర్యలు వద్దని అవినాష్ రెడ్డి వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. విచారణకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి భాస్కరరెడ్డి కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ కేసులో నిందితులు, వారి కుటుంబసభ్యులు పిటీషన్లు వేయడం చర్చనీయాంశమైంది. సీబీఐ అన్నివిధాలా పట్టుబిగించడం వల్లే ఈ స్థితికి కారణమని తెలుస్తోంది.