
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతులకు కలుగుతున్న ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ పాలన సాగిస్తోంది. రైతులకు మేలు చేసేలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల అరుదైన రికార్డ్ జగన్ సర్కార్ సొంతం కానుంది. గతంలో జగన్ సర్కార్ క్రియేట్ చేసుకున్న రికార్డును మళ్లీ జగన్ సర్కారే బ్రేక్ చేసి కొత్త రికార్డ్ నెలకొల్పింది.
Also Read : బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?
జగన్ సర్కార్ గత ఖరీఫ్ సీజన్ లో 1,00,44,463 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కోటి ఎకరాలకు పైగా నీరు అందించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. చరిత్రలో ఇది ఒక అరుదైన రికార్డ్. అయితే జగన్ సర్కార్ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 1,11,41,471 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం రైతు భరోసా ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తూ ఉండటం, ధాన్యం సేకరణ, ఇతర నిర్ణయాల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరింది.
వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో వర్షాలు కురవగా ఆ సెంటిమెంట్ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ప్రధాన ప్రాజెక్ట్ లన్నీ పూర్తిస్థాయి నీటిమట్టాలతో రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత కళకళలాడుతున్నాయి. నెల్లూరులో సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వలతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?