AP Sarkar: ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. లెక్కకు మించిన అప్పులు చేస్తూ పీకల్లోతు నష్టాల్లో మునిగిపోతోంది. అయినా జగన్ మాత్రం తన పంథా వీడటం లేదు. సంక్షేమ పథకాల అమలు ఆపడం లేదు. ఫలితంగా లక్షలాది కోట్లు అప్పనంగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి మళ్లుతున్నాయి. ఏటా లక్షల కోట్టు అప్పులు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నా ప్రభుత్వ నిర్వహణ కత్తిమీద సామే అవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ పరిస్థితి అడకత్తెరలో చిక్కిన పోకచెక్కలా మారింది.
అప్పుల లెక్కలు కొండల్లా పెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం అప్పుల కుప్పలతోనే సంక్షేమ పథకాల అమలుకు వెనకాడటం లేదు. దీంతో శాసన సభ సైతం దానికి సమ్మతి తెలుపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టం అప్పుల కూపంలోనే కాలం వెళ్లదీస్తోంది. అదనపు అప్పులు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివిధ రూపాల్లో చేసిన అప్పులు తీర్చేందుకు మాత్రం దారులు కనిపించడం లేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకున్న ప్రభుత్వం రుణాల వసూలుకు అన్ని రంగాలను ఉపయోగించుకుంటోంది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా వాటితో ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రుణాల కోసం ప్రభుత్వం తిప్పలు పడుతున్నట్లు సమాచారం.
Also Read: Twitter: ఆయనకు ట్విట్టర్ ఖాతాలేదు.. అడ్డంగా బుక్కైన మంత్రి!
రాబోయే కాలంలో అప్పుల భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి రుణాల మార్గమే కనిపిస్తోంది. కేంద్రం నుంచి రుణపరిమితి పెంపుపై ప్రయత్నాలు చేస్తోంది. అప్పులే మినహా రెవెన్యూ మార్గాలపై వాదనలు వినిపిస్తున్నాయి. అప్పులు తీసుకునేందుకు ఏకంగా చట్ట సవరణ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. దీంతో పలు మార్గాల ద్వారా అప్పులు తీసుకుని ప్రభుత్వ నిర్వహణ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణపై ఇంకా సందేహాలేనా?