CM Jagan: ఒంటరిపోరు మళ్లీ కలిసి వస్తుందా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ వేడి ప్రారంభమవుతోంది. దీంతో పార్టీల్లో ప్రచారంపై వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈసారి కూడా ఒంటరిగానే బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నందున ప్రతిపక్ష పార్టీలు ఏకమైపోతున్న సందర్భంలో జగన్ నిర్ణయం ఫలితాలు ఇస్తుందా? లేక బెడిసికొడుతుందా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. జగన్ ను ఓడించమే లక్ష్యంగా […]

Written By: Srinivas, Updated On : March 17, 2022 8:32 am

CM Jagan

Follow us on

CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ వేడి ప్రారంభమవుతోంది. దీంతో పార్టీల్లో ప్రచారంపై వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈసారి కూడా ఒంటరిగానే బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నందున ప్రతిపక్ష పార్టీలు ఏకమైపోతున్న సందర్భంలో జగన్ నిర్ణయం ఫలితాలు ఇస్తుందా? లేక బెడిసికొడుతుందా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

CM YS Jagan

జగన్ ను ఓడించమే లక్ష్యంగా అన్ని పార్టీలే ఏకం కానున్నాయి. టీడీపీ, జనసేన కూడా కలిసి పోటీ చేసే విషయం కూడా తెరపైకి వస్తోంది. కానీ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీతో వెళ్లేందుకే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ ఆశలు నెరవేరేనా అనే సంశయాలు వస్తున్నాయి. మొత్తానికి జగన్ ను ఓడించడానికే అన్ని పార్టీలు పోరాటం చేయనున్నట్లు తెలుస్తోంది. జగన్ సైతం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:  వైసీపీ తప్పుడు మద్యం విధానంతో పేదలు బలి

గతంలో ఒక్క చాన్స్ అంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ సంక్షేమ పథకాల అమలులో తన బ్రాండ్ చూపించుకున్నా అభివృద్ధి పనులు మాత్రం కనిపించకపోవడం రిమార్కుగానే మిగులుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు దీన్నే ఆయుధంగా చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం అంత సులువు కాదనే విషయం తెలుస్తోంది. ఈ కారణంగానే జగన్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. నేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.

AP CM Jagan

ప్రజల్లో కూడా అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఎన్నికల్లో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించాలని జగన్ ఉవ్విళ్లూరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read:  కేసీఆర్ తో చెడింది.. చినజీయర్ స్వామిపై వివాదాల బండ పడింది.. వీడియోతో బుక్!

Tags