Homeఆంధ్రప్రదేశ్‌తెల్ల ఏనుగులా... ఈ సలహాదారులు?

తెల్ల ఏనుగులా… ఈ సలహాదారులు?


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి పనుల కంటే సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తోంది. ‘కరోనా’ ప్రభావంతో ఖజానాకు 20 శాతం ఆదాయం కూడా లభించని ప్రస్తుత సమయంలోను ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు మాత్రం కోన సాగిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆ స్థాయిలో క్రెడిట్ రాబట్టుకోలేక పోతోంది. మరోవైపు జగన్ నిర్ణయాలు, వివిధ అంశాలపై ఆయన వైఖరి ప్రజల ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.

నేటి నుంచే ఏపీలో పెన్షన్ల పంపిణీ!

జగన్ సీఎంగా భాద్యతలు చేపట్టిన అనంతరం ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ సలహాదార్లను నియమించారు. అంతేకాకుండా వీరిలో కొందరికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. నెలకు రూ.75 వేల నుంచి 3.80 లక్షల వరకూ జీతభత్యాలు చెల్లిస్తున్నారు. వీరిలో సీఎం సలహాదారులుగా ఆరుగురు ఉండగా, వివిధ శాఖలకు సలహాదారులుగా మొత్తం 35 మంది వరకూ నియమించారు. సలహాదారుల్లో విశ్రాంత ఐఏఎస్ లు, సీనియర్ జర్నలిస్టులు, ఆయా రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ సలహాదారుల సేవలను ప్రభుత్వం ఎంతమేరకు వినియోగించుకుంటుదనే సందేహం కలుగుతోంది.

కరోనా వైరస్ విషయంలో సీఎం జగన్ మొదటి నుంచి చేస్తున్న వాదనలు పూర్తిగా వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి. ఇది కేవలం జ్వరం లాంటిదేనని, పారాశిట్మల్ టాబ్లెట్ వేస్తే తగ్గిపోయిందని చేసిన కామెంట్ నీటికి సోషల్ మీడియాలో విమర్శలు, సెటైర్లు వస్తున్నాయి. తాజాగా కరోనా తో కలిసి జీవించాల్సి ఉంటుదనటపైనా ఇదే పరిస్థితి ఉంది. మాటలలో తడబడటానికి అవకాశం ఉంటుంది దీనిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. విధానమే విరుద్ధంగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచమంతా ఒక విధంగా ఉంటే సీఎం జగన్ విధానం అందుకు విరుద్ధంగా ఉంది.

ఇంగ్లీషు మీడియంకే ఓటు..!

స్థానిక సంస్థలకు ఎన్నికల వాయిదా విషయంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నా ఫలితం ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి. మార్చి 21, 24 తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో కరోనా కేసులు జాతీయ స్థాయిని దాటిపోయేవి, ఇదే జరిగుంటే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం లేకుండాపోయే పరిస్థితి నెలకొనేది. పరోక్షంగా ప్రభుత్వానికి మేలు చేసిన రమేష్ కుమార్ ఇంత అత్యవసరంగా తొలగించడం వివాదంగా మారింది. అదే సమయంలో లాక్ డౌన్ లోను కనగరాజ్ ను రాష్ట్రానికి రప్పించడం అంతే వివాదంగా మారింది.

రాజధాని వికేంద్రీకరణకు సిద్ధమై చిన్న రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు జగన్ రాష్ట్ర ప్రజలపైగా రుద్దుతున్నారనేది వాస్తవం. టీడీపీని దెబ్బతీయడానికి అమరావతిని నిర్వీర్యం చేయాలనేది ఇందులో రాజకీయ వ్యహం. అమరావతి రైతుల సంగతి పక్కన పెడితే మూడు రాజదానుల వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు మాత్రం ఏమీ లేదనేది వాస్తవం.

ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ నిర్ణయాలపై ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. త్వరలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరగనున్న సమయంలో శాసన మండలి రద్దు నిర్ణయం. సి.ఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తొలగింపు విధానం, కరోనా నేపథ్యంలో పెన్షనర్ ల జీతంలో కోత ఇలా ఎన్నో ఉన్నాయి.

ముఖ్యమంత్రి సలహాదారులు ఆయనకు ఎటువంటి సలహాలు, సూచనలు చేస్తున్నారు అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఐఏఎస్, వివిధ రంగాలకు చెందిన నిపుణులు సలహాదారులుగా ఉన్నా సీఎం ఇటువంటి నిర్ణయాలు, విధానాలను ఎందుకు అవలంభిస్తున్నారు అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే సలహాదారులు సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప వారి అభిప్రాయాలను సీఎంకు వివరించే అవకాశం ఇవ్వరనే వాదనలు వినిపిస్తున్నాయి. విననప్పుడు రూ. కోట్లు చెల్లించి ఇంతమంది సలహాదారులను నియమించుకోవడం వారికి ఉపాధి కల్పించేందుకేనా అన్న సందేహం కలుగుతుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular