ఏపీలో ఓ వైపు పంచాయతీ ఎన్నికలు నడుస్తుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగించారు ఎస్‌ఈసీ నమ్మగడ్డ రమేష్ కుమార్. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి సారించాయి. అయితే.. పేరుకు పార్టీలే తప్ప, ఎన్నికల్లో పోటీ చేయని, ఒకవేళ బరిలో నిలిచినా నామమాత్రంగా కూడా ఫలితాలు సాధించలేని రాజకీయ పార్టీలు గోల చేస్తుండడం గమనార్హం.
Also Read: పంచాయతీ ఓట్ల కౌంటింగ్ వీడియో షూట్
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే ప్రారంభిస్తామని ఎస్ఈసీ ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలకు రుచించడం లేదు. దీంతో మీడియాకెక్కి మైక్ అందిపుచ్చుకుని నానా యాగీ చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఆగిన చోట నుంచే తిరిగి కొనసాగించడం అప్రజాస్వామికని ఆ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మేరకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటనలు, మీడియా సమావేశాలు, ఎస్ఈసీకి వినతిపత్రాలు అందించడం గమనార్హం.
Also Read: ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేదెవరో..?
ఆగిన చోట నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్న రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్, సీపీఐ, జనసేన ఉన్నాయి. ఏపీ సమాజంలో ఈ పార్టీల బలాబలాలు ఏంటో అందరికీ తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఆగిన చోట నుంచే కొనసాగిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం ప్రజాస్వామ్య బద్ధంగా లేదని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను మళ్లీ కొత్తగా ప్రారంభించాలని తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోరారన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రీనోటిఫికేషన్ ఇస్తే బాగుండేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నామినేషన్లకు, పోలింగ్‌కు మధ్య దాదాపు ఏడాది అంతరం ఉండడంతో పలుచోట్ల వైసీపీ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో నగర సంస్థలు, మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఎస్ఈసీకి పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ రాసిన లేఖను పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబుకు అందజేశారు. కానీ.. ఇప్పుడు ఆ పార్టీల తీరు విమర్శలకు దారితీస్తోంది