AP Govt Using Recovery Money: రిక‌వ‌రీ డ‌బ్బుల‌నూ వ‌ద‌లని జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఇదేం తీరు బాబు..!

AP Govt Using Recovery Money: బెల్లం ఎక్క‌డుంటే ఈగ‌లు అక్క‌డే వాలుతాయ‌నే సామెత మీకు గుర్తుంది క‌దా.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ప‌ని తీరు కూడా అలాగే ఉంది. ఎక్క‌డ డ‌బ్బులు ఉంటే అక్క‌డ వాలిపోతోంది. వెంటనే ఆ డ‌బ్బుల‌ను వాడేసుకుంటోంది. ఈ శాఖ‌, ఆ శాఖ అనే తేడాలు లేకుండా.. ఎక్క‌డ మ‌నీ వాస‌న వ‌చ్చినా వ‌దిలిపెట్ట‌ట్లేదు. ఇప్పుడు ఏపీ ఆర్థిక ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో గ‌మ‌నిస్తూనే ఉన్నాం. వాటికి అద్ధం ప‌ట్టే విధంగా […]

Written By: Mallesh, Updated On : April 20, 2022 4:39 pm
Follow us on

AP Govt Using Recovery Money: బెల్లం ఎక్క‌డుంటే ఈగ‌లు అక్క‌డే వాలుతాయ‌నే సామెత మీకు గుర్తుంది క‌దా.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ప‌ని తీరు కూడా అలాగే ఉంది. ఎక్క‌డ డ‌బ్బులు ఉంటే అక్క‌డ వాలిపోతోంది. వెంటనే ఆ డ‌బ్బుల‌ను వాడేసుకుంటోంది. ఈ శాఖ‌, ఆ శాఖ అనే తేడాలు లేకుండా.. ఎక్క‌డ మ‌నీ వాస‌న వ‌చ్చినా వ‌దిలిపెట్ట‌ట్లేదు. ఇప్పుడు ఏపీ ఆర్థిక ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో గ‌మ‌నిస్తూనే ఉన్నాం. వాటికి అద్ధం ప‌ట్టే విధంగా ఇప్పుడు మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది.

AP Govt

సాధార‌ణంగా దోపిడీలు, దొంగతనాల కేసుల్లో నేర‌గాళ్ల‌తో స‌హా డ్బ‌బుల‌ను స్వాధీనం చేసుకున్న‌ప్పుడు వాటిని జ‌మ చేస్తుంటారు. కోర్టుల్లో ఎవ‌రికైతే ఆ డ‌బ్బులు తేలుతాయో వారికి అప్ప‌గించాలి. ఇది రూల్‌. అయితే ఏపీలో గ‌త కొద్ది నెలుగా స్వాధీనం చేసుకున్న డ‌బ్బుల‌ను జ‌మ చేస్తున్నారు త‌ప్ప‌.. కోర్టులు తీర్పులు ఇస్తున్నా చెల్లింపులు మాత్రం చేయ‌ట్లేదు.

Also Read: Prashanth Kishore: పీకే.. ప్రాంతీయ పార్టీలను కాదని కాంగ్రెస్ లోకి ఎందుకు వెళుతున్నారు?   

అదేంటి స్వాధీనం చేసుకున్న డ‌బ్బుల‌ను చెల్లించాలి క‌దా అంటే మాత్రం ప్ర‌భుత్వ అధికారులు స్త‌బ్తుగా ఉండిపోతున్నారు. ఎందుకంటే.. ఆ డ‌బ్బుల‌ను ప్ర‌భుత్వం ఎప్పుడో వాడేసుకుంటోంది. దీంతో ఏం చెప్పాలో తెలియ‌క మౌనంగా ఉండిపోతున్నారు. జ‌మ చేసిన సొమ్మును వెంట వెంట‌నే ప్ర‌భుత్వం అవ‌స‌రాల‌కు వాడేసుకుంటోంది. తిరిగి చెల్లించ‌ట్లేదు.

CM Jagan

న్యాయస్థానాళ ఖాతాల్లో అలాగే.. న్యాయమూర్తుల ఖాతాల్లో జ‌మ చేస్తున్న న‌గ‌దును ప్ర‌భుత్వం వాడుకోవ‌డం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎంత‌లా ఆర్థిక సంక్షోభం ఉందో చెబుతోంది. న‌గదును మ‌ళ్లించుకోవ‌డంలో చూపిస్తున్న చొర‌వ‌ను.. చెల్లించ‌డంలో మాత్రం చూపించ‌ట్లేదు జ‌గ‌న్ ప్ర‌భుత్వం. సాధార‌ణంగా ఏపీలోని కోర్టుల్లో నెలకు రూ.వంద కోట్ల దాకా కక్షిదారులకు చెల్లింపులు జ‌రుపుతారు.

కానీ ఇప్ప‌డున్న ప‌రిస్థితుల్లో చెల్లింపులు చేయ‌క‌పోవ‌డంతో.. ఎంతో ఆశ‌గా ఎద‌రు చూస్తున్న ల‌బ్ధిదారుల‌కు నిరాశే ఎదుర‌వుతోంది. త‌మ‌ది సంక్షేమ ప్ర‌భుత్వం అని చెప్పుకునే జ‌గ‌న్.. డ‌బ్బుల కోసం మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా అని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఒక‌వేళ ఎవ‌రైనా ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయిస్తే గ‌న‌క జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌రువు పోవ‌డం ఖాయం.

Also Read:Minister RK Roja: బాల‌య్య‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రోజా.. ఇన్నాళ్ల‌కు గుర్తొచ్చాడా..!
Recommended Videos

Tags