https://oktelugu.com/

Jagan Sarkar: కిక్కూ ఎక్కడిదిక.. మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

Jagan Sarkar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. మద్యం ప్రియుల జేబులు గుళ్ల చేస్తోంది. మద్యం ధరలపై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్టంలో విక్రయించే మద్యం విక్రయాలపై మరోమారు పంజా విసిరారు. మద్యం ధరల్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం సవరించిన ధరలతో ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. మద్యం బ్రాండ్లపై మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 10, 2021 / 07:59 PM IST
    Follow us on

    Jagan Sarkar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. మద్యం ప్రియుల జేబులు గుళ్ల చేస్తోంది. మద్యం ధరలపై వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్టంలో విక్రయించే మద్యం విక్రయాలపై మరోమారు పంజా విసిరారు. మద్యం ధరల్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం సవరించిన ధరలతో ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.

    మద్యం బ్రాండ్లపై మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.400 ధర ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ విధించేందుకు సంకల్పించింది. రూ.400 నుంచి 2500 వరకు ఉన్న మద్యం కేసుకు సంబంధించి 60 శాతం వ్యాట్ విధించనుంది. రూ.2500 నుంచి 3500 వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం విధించనున్నారు. ఇక రూ.3500 నుంచి 5000 వరకుఉన్న మద్యం కేసుపై 50 శాతం మేర పన్ను విధించేందుక సిద్ధమైంది.

    మద్యం ధరలపై జగన్ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు మోపడతంతో మద్యం ప్రియుల్లో ఆందోళన నెలకొంది. వైసీపీ ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో జగన్ ప్రజలపైనే పెనుభారం మోపుతోందని తెలుస్తోంది. మద్యం ధరల పెంపుదలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా మందుబాబుల జేబులు గుళ్ల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

    Also Read: Nara Lokesh: మారిన లోకేష్ లుక్.. ఆయన్ను కాపీ కొట్టారా?

    కొత్తగా పెంచిన ధరలను ప్రభుత్వం తక్షణమే అందుబాటులో రానున్నాయి. ఈ మేరకు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ధరలను తొలి విక్రయం జరిగే చోట సవరణ ఉంటుందని చెబుతోంది. ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ధరల భారం పెరుగుతోంది. పెరుగుతున్న ధరలతో ఇక మద్యం ప్రియులు దాన్ని ముట్టుకోవడానికి భయపడే సూచనలు కనిపిస్తున్నాయి. పెంచిన ధరలు అంత భారంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Harish Rao: హరీష్ కు వైద్యఆరోగ్యశాఖ,, కేసీఆర్ సరికొత్త వ్యూహం అదేనా?

    Tags