Homeఆంధ్రప్రదేశ్‌'సాంఘిక దూరం' పట్టించుకోని ఏపీ ప్రభుత్వం

‘సాంఘిక దూరం’ పట్టించుకోని ఏపీ ప్రభుత్వం


నేడు మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా కట్టడికి `సామజిక దూరం’ పాటించడమే ఏకైక మార్గం అని అందరు చెబుతున్నారు. ఆ విధంగా చేయమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హిత బోధనలు చేస్తున్నాయి. కేవలం అందుకోసమే ప్రధాని నరేంద్ర మోదీ నుండి మూడు వరాల పాటు లాక్ డౌన్ పాటించమని ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక వంక కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉండగా, సాంఘిక దూరం పాటింప చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడి అవుతున్నది. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఈ విషయంలో ప్రభుత్వ అధికారులే ధిక్కార ధోరణి అవలంభిస్తున్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పేదలకు రూ 1,000 నగదు పంపిణి సహితం పరవశంగా జరిగి పోయింది. శనివారం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం పంచాయతీ ఎన్నికల ప్రచారం స్థాయిలో, ఒక పార్టీ కార్యక్రమం వలే కోలాహలంగా జరిగింది. వైసిపి కార్యకర్తలు గుంపులుగా ఇంటింటికి వెళ్లి డబ్బు పంచుతూ కరోనా నియంత్రణ గురించి ఏమాత్రం పట్టించుకోనని లేదు.

మరోవంక, స్వయంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఒంగోలు లో జరిగింది. జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (ఎఎన్‌ఎం), జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జిఎన్‌ఎం) పోస్టుల దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా స్వయంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు.

ఈ సందర్భంగా `సామాజిక దూరం’ పాటించక పోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు గురి కావాల్సి వచ్చింది.కరోనా నేపథ్యంలో ఎఎన్‌ఎం, జిఎన్‌ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో, దరఖాస్తు చేసుకొనేందుకు ఒంగోలు కలెక్టరేట్‌లోని డిఎం అండ్‌ హెచ్‌ఒ కార్యాలయానికి శనివారం సుమారు 250 మంది మహిళలు వచ్చారు.

అభ్యర్థులు భౌతిక దూరం పాటించేలా, ఇతర జాగ్రత్తల విషయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదు. దీంతో, ఒక్కసారిగా వచ్చిన మహిళల అభ్యర్థులు కార్యాలయం వద్ద గుంపులు గుంపులుగా చేరారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, కరోనా నివారణ నిబంధనలు అమలు కాని పరిస్థితి నెలకొందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకొని పోలీసులు వచ్చి వారిని వరుసలో, దూరం – దూరంగా నిలబెట్టారు. కరోనా సమయంలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన శాఖే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలకు తావిచ్చింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version