cinema Ticket: ఏపీలో ఇక సినిమా టికెట్లు ఆన్ లైన్ లోనే.. లాభమా.? నష్టమా?

cinema Ticket: ఆంధ్రప్రదేశ్ లో ఇక ఆన్ లైన్ లోనే సినిమా టికెట్లు దొరకనున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ముందస్తు షోల పేరుతో ఒక్కో టికెట్ ను రూ.1000 నుంచి రూ.5వేల వరకూ అమ్మి సొమ్ము చేసుకునే వారు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా దెబ్బపడింది. ఇక బ్లాక్ మార్కెట్ టికెట్ దందా ఉండనే ఉంది. సో వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని […]

Written By: NARESH, Updated On : November 13, 2021 12:49 pm
Follow us on

cinema Ticket: ఆంధ్రప్రదేశ్ లో ఇక ఆన్ లైన్ లోనే సినిమా టికెట్లు దొరకనున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు ముందస్తు షోల పేరుతో ఒక్కో టికెట్ ను రూ.1000 నుంచి రూ.5వేల వరకూ అమ్మి సొమ్ము చేసుకునే వారు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా దెబ్బపడింది. ఇక బ్లాక్ మార్కెట్ టికెట్ దందా ఉండనే ఉంది. సో వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తోంది. ఇప్పటికే సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ ఈ విధానానికి ఓకే చెప్పారు.

ఏపీలో ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తాజాగా ఏపీ సినీ ఎగ్జిబిటర్లు స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ కొత్త విధానానికి సహకరిస్తామన్నారు.

తాజాగా మంత్రి పేర్ని నాని ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రారంభించడానికి మంత్రి పేర్ని నాని సమావేశం నిర్వహించారు. థియేటర్లకు గ్రేడింగ్ సిస్టం, టికెట్ రేట్ల పెంపుపై సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని ఎగ్జిబిటర్లు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ సినిమా టికెట్ల పై వేగంగా ముందుకెళుతోంది. కొత్త విధానం అమలు, థియేటర్ల సహకారంపై ఎగ్జిబిటర్లతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. మొదట పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి పేర్ని నాని.

ఈ క్రమంలోనే ఎగ్జిబిటర్లు ఆన్ లైన్ టికెట్ విధానంపై ప్రభుత్వ నిర్ణయానికి అంగీకారం తెలిపారు. ఇక ప్రైవేట్ యాప్ లతో కుదుర్చుకున్న మరో అగ్రిమెంట్ ను ఎగ్జిబిటర్లు ప్రస్తావించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఆయా సంస్థలతో కూడా మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు.

ఇక చిన్న ఊర్లలోని థియేటర్లలో గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాలని థియేటర్ యజమానులకు మంత్రి పేర్ని నాని సూచించారు. థియేటర్లు నుంచి ఎఫ్డీసీ వసూలు చేస్తున్న న్యూస్ రీల్స్ మీద రెంటల్ చార్జీ కూడా రద్దు చేయడానికి మంత్రి హామీ ఇచ్చినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు.

అన్ని జిల్లాల ఎగ్జిబిటర్లతో కూడా సమావేశాలు పూర్తి అయిన తర్వాత ఈ ఆన్ లైన్ టిక్కెట్ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు టికెట్ రేట్ల విషయంలో సీఎంతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. దీంతో ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం ఇక అమలు జరగడం ఖాయమే. దీనివల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుండగా.. స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు, నిర్మాతల ప్రాఫిట్ కు భారీగా బొక్క పడనుంది. అదే సమయంలో ఈ విధానంతో చిన్న సినిమాలకు, నిర్మాతలకు లాభం చేకూరనుంది. పెద్ద నిర్మాతలకే ఈ విధానం వల్ల నష్టం జరుగనుంది.

Also Read: కిక్కూ ఎక్కడిదిక.. మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

ఏపీ మంత్రులను ‘ఎర్రిపుష్పం’ అవార్డులతో సత్కరిస్తాం?