నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీలో యువత డీఎస్సీ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే డీఎస్సీ ప్రకటన ఉండబోతుందంటూ జగన్ సర్కార్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. 2018 డీఎస్సీలో ఉత్తీర్ణులైన ఎస్జీటీ ఉద్యోగులకు నియామక ప్రక్రియను ప్రారంభించనున్నామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. Also Read : తెలంగాణలో పొలిటికల్  హీట్ కోర్టులో ఇన్నిరోజుల పాటు పెండింగ్ లో ఉన్న కేసు కొట్టివేయడంతో జగన్ […]

Written By: Kusuma Aggunna, Updated On : September 23, 2020 10:23 am
Follow us on

ఏపీలో యువత డీఎస్సీ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే డీఎస్సీ ప్రకటన ఉండబోతుందంటూ జగన్ సర్కార్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. 2018 డీఎస్సీలో ఉత్తీర్ణులైన ఎస్జీటీ ఉద్యోగులకు నియామక ప్రక్రియను ప్రారంభించనున్నామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

Also Read : తెలంగాణలో పొలిటికల్  హీట్

కోర్టులో ఇన్నిరోజుల పాటు పెండింగ్ లో ఉన్న కేసు కొట్టివేయడంతో జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూరైంది. ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇవ్వనుంది. ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రకటన వెలువడంతో యువత ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇదే సమయంలో 2020 డీఎస్సీ త్వరలో విడుదల కానుందని కీలక ప్రకటన చేశారు. ఏపీలో నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో డీఎస్సీ అనేది నిరుద్యోగులకు పండగ లాంటి వార్త అనే చెప్పాలి. టెట్ సిలబస్ మారుతుందని… ట్రిపుల్ ఐటీ విషయంలో రేపు తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని అన్నారు.

ఇంటర్ సిలబస్ ను కుదించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితోనే పాఠశాలలకు రావాలని సూచించారు. 5+3+3+4 విధానంలో విద్యను ఏపీ మొదట అమలు చేయబోతుందని.. కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చిన తరువాత ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Also Read : బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?