YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల అమలు కొనసాగుతోంది. సీఎం జగన్ పథకాలను నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మధ్యవర్తుల అవసరం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేయడంతో ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. అయినా జగన్ వెనకకు పోకుండా ప్రజలకు మేలు చేకూర్చేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రైతు భరోసా పథకంలో యాభై లక్షలకు పైబడిన రైతులకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.4 వేలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ.2052 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.2 వేలు కేంద్రం ఆగస్టులోనే ఇచ్చింది. దీంతో జగన్ వేసే నగదుపై క్లారిటీ లేదు. కేంద్ర జాబితాలో 30 లక్షల మంది రైతులు కూడా లేరని తెలుస్తోంది.
సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు సున్నా వడ్డీ పథకం అమల్లోకి రానుండటంతో రైతులకు రాయితీ చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 2020 కాలంలో 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించేందుకు బ్యాంకులో జమ చేయనున్నారు. దీంతో ప్రజలకు నేరుగా పథకాలు దరిచేరనున్నాయి.
మరోవైపు ఆధునిక వ్యవసాయ, యంత్ర పరికరాలపై సబ్సిడీని పాతిక కోట్లు కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే రూ.25 లక్షల విలువైన వరికోత యంత్రాలను సబ్సిడీపై ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రైతులు కమిటీలుగా ఏర్పడి సబ్సిడీ పొందేందుకు రెడీ అయ్యారు. దీంతో ప్రభుత్వం కూడా వారికి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
Also Read: మోడీపై కేసు వేసిన బామ్మా.. ఆంధ్రప్రదేశ్ కు ఓసారి రావమ్మా!