AP BJP Somu Veerraju Deeksha: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అగాధం పెరిగిపోతోంది. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు ఉద్యోగులు తమ పంతం కోసం పోరాడుతూనే ఉన్నారు. దీంతో ప్రజాపాలన కుంటుపడిపోతోంది. ఉద్యోగుల డిమాండ్లు తీర్చాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలే కాదు నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఉద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేయనున్నారు. ఇవాళ రాష్ర్ట పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు.

ప్రభుత్వ నిర్వాకంతో అందరు బాధ్యులే అవుతున్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోవడంతో వారు పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతోనే ఉద్యోగులు సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి ఏ రకమైన చర్యలు లేకపోవడంతోనే వారు ఆందోళన బాట పట్టినట్లు తెలుస్తోంది.
Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యేనా?
అయితే ఇందులో పలువురు జోక్యం చేసుకున్నా ఫలితం మాత్రం శూన్యమే. దీంతో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విశ్రమించేది లేదని చెబుుతున్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కూడా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. రాష్ర్టంలో సంక్షోభ పరిస్థితికి టాటా చెప్పి ప్రజల పనులు సజావుగా సాగేందుకు ఉద్యోగుల సమ్మె విరమింపజేయాలని చూస్తున్నారు.
దీంతో రాష్ర్టంలో పరిస్థితి మరింత ముదిరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులతో పలు దఫాలు చర్చలు జరిపినా అవి కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీంతోనే వారు సమ్మె విరమించడం లేదని తెలుస్తోంది. కానీ రాష్ర్ట ప్రయోజనాల దృష్ట్యా సమ్మె ప్రభావం అంత మంచిది కాదని చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతోనే సమ్మె విరమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఫలించడం లేదు. కానీ సోము వీర్రాజు చేస్తున్న దీక్షతోనైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
Also Read: ఉద్యోగులకు గట్టి షాకిచ్చిన హైకోర్టు
[…] Team India: కొత్త ద్వయం టీమిండియాను కప్ గెలిచేలా చేస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్న వేళ తొలి అడుగే అపశకునంగా మారింది. విరాట్ కోహ్లీ దిగిపోయాక కెప్టెన్సీ మార్పు జరిగాక.. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో జరిగిన తొలి పర్యటనలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా చేతిలో 3-0తో చిత్తు అయ్యింది. ఎన్నో ఆశలతో సౌతాఫ్రికా టూర్ కు వెళ్లిన భారత జట్టు ఒట్టి చేతులతో తిరిగొచ్చింది. అయితే వన్డే క్రికెట్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లిని తప్పించిన తరువాతే భారత్ కు సందిగ్ధ పరిస్థితి ఏర్పడిందా..? అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. విరాట్ కోహ్లిని వన్డే నుంచి తప్పించి బీసీసీఐ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయా..? అని అనుకుంటున్నారు. అయితే వన్డే క్రికెట్ పరిస్థితి ఇలా ఉంటే టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా కోహ్లి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు కోహ్లి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గాయాల బారినపడుతుండడం.. కేఎల్ రాహుల్ లో నాయకత్వ పటిమ లేకపోవడంతో టీమిండియాలో ఇప్పుడు ఏర్పడిన సమస్య పరిష్కరించకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. […]