https://oktelugu.com/

DMK : స్టాలిన్ కొడుకు, అల్లుడు ఒక్క సంవత్సరంలో 30 వేల కోట్లు సంపాదించారు

అన్నామలై తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఏప్రిల్ 14వ తేదీన డీఎంకే ఫైల్స్ బయటపెట్టాడు. లక్షా 34 వేల కోట్ల బినామీ ఆస్తులు డీఎంకే నేతలకు ఉన్నాయని బాంబు పేల్చాడు. అయితే ఇది పార్ట్ 1 అని లైట్ తీసుకున్నారు. ఒట్టి ఆరోపణలు అని అందరూ మిన్నకున్నారు. తాజాగా పీటీఆర్ ఆడియో లీక్ అయ్యి వైరల్ అయ్యింది. స్టాలిన్ కొడుకు, అల్లుడు ఒక్క సంవత్సరంలో 30వేల కోట్లు తినేశారు. ఈ పీటీఆర్ పేరుతో లీక్ అయిన ఈ ఆడియో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 21, 2023 / 09:35 PM IST
    Follow us on

    అన్నామలై తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఏప్రిల్ 14వ తేదీన డీఎంకే ఫైల్స్ బయటపెట్టాడు. లక్షా 34 వేల కోట్ల బినామీ ఆస్తులు డీఎంకే నేతలకు ఉన్నాయని బాంబు పేల్చాడు. అయితే ఇది పార్ట్ 1 అని లైట్ తీసుకున్నారు. ఒట్టి ఆరోపణలు అని అందరూ మిన్నకున్నారు. తాజాగా పీటీఆర్ ఆడియో లీక్ అయ్యి వైరల్ అయ్యింది. స్టాలిన్ కొడుకు, అల్లుడు ఒక్క సంవత్సరంలో 30వేల కోట్లు తినేశారు. ఈ పీటీఆర్ పేరుతో లీక్ అయిన ఈ ఆడియో ఏంటి? ఎందుకు సంచలనమైంది. పీటీఆర్ అంటే.. పి. త్యాగరాజన్.. తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి. అన్నామలైను తీవ్రంగా విమర్శించిన త్యాగరాజన్ గుట్టును అన్నామలై బయటపెట్టాడు.

    తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అధికార పార్టీ నేతల అవినీతిని బయటపెడుతున్నాడు. డీఎంకే ఫైల్స్ పేరుతో ఒక్కొక్క డీఎంకే నేత ఎన్ని కోట్లు ప్రజల సొమ్ము దిగమింగారో లెక్కలతో సహా చెబుతున్నాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం ట్విట్టర్లో డీఎంకే ఫైల్స్ ట్రెండింగ్ గా నిలుస్తోంది. స్టాలిన్ సోదరి కనిమొలి ఎన్నికల సమయంలో తన ఆస్తులను 30 కోట్లుగా పేర్కొంది. కానీ ఆమెకు కలయింగర్ టీవీలో ఆమెకు ఎనిమిది వందల కోట్ల విలువైన వాటాలు ఉన్నాయి. కేవలం ఏళ్ల వ్యవధిలోనే ఇంత సంపాదన ఎలా సాధ్యమైంది అనేది అన్నామలై ప్రధాన ప్రశ్న.ఇక జగత్ రక్ష కన్ అనే మంత్రి తన ఎన్నికల అఫిడవిట్లో అప్పులు ఉన్నాయని చూపించాడు. ఇప్పుడు ఆయన సంపాదన ఏకంగా వందల కోట్లకు వెళ్ళిపోయింది. ఇది ఎలా సాధ్యమవుతుందో చెబితే తమిళ ప్రజలు మొత్తం అనుసరిస్తారని అన్నామలై అడుగుతున్నాడు.

    ఇక ఇవి వేలు అనే మంత్రి ఎన్నికలప్పుడు తన అరుణయి అనే కాలేజీ విలువ 1086 కోట్లు ఉంటుందని అఫిడవిట్ లో ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆయన కాలేజీ విలువ నాలుగు వేల కోట్లకు పెరిగింది. ఆయన కాంబన్ కాలేజీ విలువ కూడా 141 కోట్లకు పెరిగింది.ఇక మరో మంత్రి కేఎన్ నెహ్రూ కూడా తన సంపాదనను వేల కోట్లకు పెంచుకున్నారు. ఇలా 27 డిఎంకె నాయకులు తమ ఆస్తులను అడ్డగోలుగా పెంచుకున్నారని అన్నామలై ఆరోపిస్తున్నాడు.

    స్టాలిన్ కొడుకు, అల్లుడు ఒక్క సంవత్సరంలో 30 వేల కోట్లు సంపాదించాడని తాజాగా అన్నామలై బయటపెట్టాడు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..