
రాష్ట్రం అంతా కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తన పంధా వీడటం లేదని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. బాబు ఈ రాష్ట్రంలో లేడని, పక్క రాష్ట్రంలో ఉన్నాడన్నారు. ముసలివాళ్లు, చిన్నపిల్లలకు జాగ్రత్తలు తీసుమని ప్రభుత్వం సూచిస్తుందన్నారు. చంద్రబాబు వయస్సుపైబడినందువల్ల ప్రభుత్వం ఆయనను హోమ్ ఐసోలేషన్ లో జాగ్రత్తగా ఉండమని చెబుతోందన్నారు. ఆయన కుమారుడు లోకేష్ వృద్ధుడు కాదుగా, ఆయన అయినా రాష్ట్రంలో ఉంటే బాగుండేదని చెప్పారు. హైదరాబాద్ లో కూర్చుని వాళ్ల చెంచాలతో అబద్దపు, తప్పుడు ప్రచారాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు.
హైకోర్టు ఇంగ్లీషు మీడియంపై ఆదేశాలు ఇస్తే దానికి ఏదో సంబరపడిపోతున్నారని ఎద్దేవ చేశారు. బడగుబలహీనవర్గాలు, మైనారిటీల పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదిగేవిదంగా చేయాలనేది మా ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఇంగ్లీషు మీడియం మీ బిడ్డలకేనా తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించారు. తెలుగు మీడియంపై అంతప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ నాయకులు వాళ్ళ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని ప్రశ్నించారు. బిడ్డను తెలుగు మీడియంలో చేర్పించిన ఒక్క తెలుగుదేశం నాయకుడుని చూపించాలని బాబుని కోరారు. నీ మనవడు దేవాంషును తెలుగు మీడియంలో చేర్చవచ్చని సూచించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు 20 ఏళ్ల తర్వాత ప్రతిపేదవాడి బిడ్డ మంచిస్దాయిలో ఉండాలని, పోటీ ప్రపంచంలో పోటీపడేలా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ర్టంలో 95 శాతం మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంగ్లీషు మీడియంలో చేర్పించాలనే ఏకభిప్రాయంతో ఉంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆయన బినామిలు నారాయణ,చైతన్య సంస్ధలను బతికించుకునేదానికి ఈ విద్యా వ్యవస్ధలో ప్రైవేటీకరణ పెంచి గవర్నమెంట్ విద్యను నాశనం చేశారని తెలిపారు.
ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వం వెనకకు పోయేది లేదని, ఖచ్చితంగా ప్రతి బిడ్డను ఒక మంచిస్ధాయిలో ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. మాజీ ఎలక్షన్ కమీషనర్ రమేష్ కుమార్ చేస్తున్న కార్యక్రమాలు మాకు ఇబ్బందిగా ఉన్నాయని చెప్పారు. కేంద్రహోంశాఖకు లెటర్ ఎవరు రాశారు అని ప్రశ్నిస్తే ఎంత వరకూ మాట్లాడని రమేష్ కుమార్ ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి లేఖ రాస్తే ఇప్పుడు తానే ఆ లేఖ రాశాను అని చెప్పారని అన్నారు. ఈ రోజు సూటిగా మూడు ప్రశ్నలు అడిగామని, లేఖ టిడిపి ఎంపి కనకమేడల వద్ద నుంచి వచ్చింది అవునా…కాదా…ఆయన డ్రాఫ్ట్ చేసింది కాదా…ఏ ఐపి అడ్రస్ నుంచి వచ్చింది అని అడుగుతుంటే ఎందుకు టీడీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులు నిగ్గుతేలుస్తారు అంటే అది అవసరం లేదని ఎందుకు అంటున్నారో చెప్పాలన్నారు.
నిజంగా మీరే డ్రాఫ్ట్ చేసి ఉంటే మీకు భయం ఎందుకు అవసరం లేదన్నారు. ఇది ఏ ఆఫీసు నుంచి వచ్చింది, ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఏ ఐపి నుంచి వచ్చింది, అని తెలిస్తే మీ బంఢారం అంతా బట్టబయలవుతుంది కాబట్టి భయపడి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమీషన్ పై ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో అది తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల కమిషనర్, తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు ఈ ప్రభుత్వం నడుచుకోవాలా అని ప్రశ్నించారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం అంతా కరోనా తో అల్లాడుతుంటే చంద్రబాబు బుర్రమాత్రం ఎల్లోవైరస్ తో నిండిపోయిందన్నారు. ఈరోజు దేశంలోనే కరోనా నిర్ధారణకు అత్యధిక పరీక్షలు చేసే రాష్ర్టంలో ఏదైనా ఉందంటే అది ఏపి మాత్రమేనన్నారు.