Homeఆంధ్రప్రదేశ్‌Bendapudi Students: అమెరికా యాసలో దంచేసిన బెండపూడి విద్యార్థులు..ట్రోలింగ్ ను ఎదిరించి నిలిచారు

Bendapudi Students: అమెరికా యాసలో దంచేసిన బెండపూడి విద్యార్థులు..ట్రోలింగ్ ను ఎదిరించి నిలిచారు

Bendapudi Students: ఆంధ్ర విద్యార్థులు ‘అమెరికన్ యాస’లో దంచి కొట్టినట్టు మాట్లాడిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వారి భాషపటిమను గుర్తించి ఏకంగా సీఎం జగన్ వారిని సచివాలయానికి రప్పించి మరీ అభినందించారు.   కానీ అంతకుముందే ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడం.. పైగా అమెరికా యాసలో ఇంగ్లీష్ ను దంచికొట్టడంతో విద్యార్థిని ఇలా ఎలా మాట్లాడడం సాధ్యమని చాలా మంది ఆ వీడియోలను షేర్ చేసి సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ అనాగరిక బెదిరింపు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి  ఈ ఆంగ్ల అనర్గళంగా మాట్లాడిన బెండపూడి పాఠశాల విద్యార్థులను ఆహ్వానించిన రోజు అందరూ వారికి తగిన గౌరవం దక్కిందని అనుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన రిష్మా కొల్లాపు అనే విద్యార్థి అయితే సీఎం ముందే ఇంగ్లీష్ మాట్లాడి అబ్బురపరిచింది.  ఇది తనకు గర్వకారణం అన్నది..మే 19న ఈ సంఘటన జరిగిన  టీవీలో ప్రసారం కాగానే  రిష్మా జీవితం ఒక పీడకలగా మారింది. ఆమె మరియు ఆమె స్నేహితులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడారు.. భారతీయ యాసలో కాదు, కానీ ప్రత్యేకమైన అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడడం చూసి అందరూ అబ్బురపరిచారు.. ఆమె, ఆమె స్నేహితులు-15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. సోషల్ మీడియాలో దుర్మార్గంగా ట్రోల్ చేయబడ్డారు. వారికి కౌన్సెలింగ్ అవసరం. రాజకీయ నేతలు కూడా ఈ విద్యార్థులపై ఆడిపోసుకున్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యార్థులు అవమానకరమైన అవహేళనకు గురి అయ్యారు

జగన్‌తో వారు మాట్లాడిన వీడియోలు వైరల్‌గా మారినప్పుడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి ‘పాశ్చాత్య యాస’ ఎలా మాట్లాడుతారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో లేవనెత్తాయి. ఏపీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను వెక్కిరిస్తూ మీమ్స్ మరియు వీడియోలు ఆన్‌లైన్‌లో వచ్చాయి. కొందరు బెదిరింపులు దిగారు. కనికరం లేకుండా ఎగతాళి చేశారు.

విద్యార్థులు వీటి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు.  “మొదట్లో తమ ప్రతిభకు అభినందనలు చూసి చాలా సంతోషంగా అనిపించిందని.. గర్వంగా ఉన్నానని.. నా తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారని.. కానీ, అన్ని మీమ్స్ చూసి  నేను చాలా రోజులు బాధపడ్డాను.  నేను ఏదైనా తప్పు చేశానా? అమెరికన్ యాస లో మాట్లాడడం   అంత చెడ్డ విషయమా? ప్రజలు మమ్మల్ని ఎందుకు వెక్కిరిస్తున్నారు” అని విద్యార్థిని అనూష పెయ్యాల వాపోయారు. ఈ వాదనలను ఖండించేందుకు కొంతమంది విద్యార్థులు తమ నివేదిక కార్డులను మీడియాకు చూపించారు.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత ఆనం వెంకట రమణారెడ్డి విలేకరుల సమావేశంలో ఈ ఆంగ్లంలో మాట్లాడుతున్న విద్యార్థులను అవమానించేలా మాట్లాడారు. పదోతరగతి  బోర్డు పరీక్షలో విద్యార్థులు ఫెయిల్ అయినట్టు.. తక్కువ మార్కులు వచ్చినట్టు తేలడంతో  యూట్యూబ్ లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇవి అగ్నికి ఆజ్యం పోశాయి. విద్యార్థులపై ప్రతి ఒక్కరూ ట్రోలింగ్ మరియు మీమ్స్ తెచ్చారు. వీరిని ఎగతాళి చేస్తూ వీడియోలు చూపించారు. అలాంటి వీడియోలు వందల సంఖ్యలో ఉన్నాయి.

కనికరంలేని ఆన్‌లైన్ దాడితో విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. బహిరంగ అవమానాలు వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. “విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ’ ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా బెండపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రసాద్ గంటా వీర సూచించారు. ఈ రోజు వరకు వందలాది వీడియోలు మరియు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విద్యార్థులను ఎగతాళి చేస్తున్నాయి.

అయితే సోషల్ మీడియాలో విద్యార్థులపై తీవ్రమైన దాడి తర్వాత విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.  అమెరికన్ యాసలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ సార్ ప్రసాద్ జూమ్ మీటింగ్‌లు నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థితో మాట్లాడారు వీటన్నింటి బారిన పడవద్దని చెప్పారు. వారి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రభుత్వం ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని మరిన్ని పాఠశాలలకు విస్తరించడానికి పని చేస్తోంది. వారికి కూడా సహాయం చేయడానికి ఆ ఇంగ్లీష్ టీచర్ ప్రసాద్ ను నియమించారు.

ఇంత జరిగినా ఆ విద్యార్థులు తమ యాసను వదులుకోవడం లేదు. “రాజకీయ నాయకులు, సోషల్ మీడియా సమూహం   ట్రోల్ చేసిన వెనక్కి తగ్గమని విద్యార్థులు చెబుతున్నారు.. రిష్మా తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version