Rowdy Sheet Rules: పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో, రాజకీయంగా రౌడీషీట్ అనే పదం తరచూ వింటూనే ఉంటాం . రౌడీషీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం, అభద్రత భావం . రౌడీషీటర్ అనీ ఒక వ్యక్తికి ముద్రపడగానే కొంత వరకు సమాజం ఆ వ్యక్తిని చిన్నచూపు చూపిస్తుంది. కొందరు సాధారణ పౌర జీవనం నుంచి గతి తప్పిన యువకులు, చెడు వ్యసనాలకు పాల్పడి నేరాలు చేసి కేసులు నమోదు కావటం వలన పలు పోలీస్‌స్టేషన్లలో రౌడీలుగా నమోదవుతున్నారు. నేరం చేసి జైలుకు వెళ్లినా మార్పు రానివారిపై పోలీసులు రౌడీషీట్ తెరుస్తున్నారు. ఇటీవల రాజకీయనాయకులే గిట్టనివారు, ఇతర ప్రత్యర్థుల మీద పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్ ఓపెన చేయిస్తున్నారు.
రౌడీ షీట్ అంటే..
ఒక వ్యక్తి పదేపదే నేరాలకు పాల్పడితే అతనిపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేయటాన్ని రౌడీషీట్ అంటారు. స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ అభ్యర్థన మేరకు సీపీ, ఏసీపీ, డీఎస్పీ రెండూ , లేదా మూడు కంటే ఎక్కువ కేసులూ నమోదు అయినవారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు. పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగిన సందర్భాల్లో జడ్జి సూచనతో మాత్రమే హిస్టరీ షీట్ ఓపెన్‌చేయాలి. రౌడీషీట్ తెరవొద్దు.
– ఈ నేరాల చేసేవారిపై రౌడీషీట్..
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటì æవరకు సుమారు 2,500 పైగా రౌడీషీట్స్ ఓపెన్ చేశారని గణాంకాలు చెప్తున్నాయి. భూమాఫియా చేసే వారిపై , సెటిల్మెంట్‌లు చేసేవారిపై, హత్య కేసులు ఉన్నవారిపై, ఈవ్ టీజర్స్‌పై, దోపిడీలు చేసే వారిపై రౌడీ షీట్లు నమోదు చేస్తున్నారు. భూ సమస్యలు ఉన్నవారిపై , చిన్నచిన్న నేరాలకు పాల్పడిన వారిపై రాజకీయ నేతల ఒత్తిడితో రౌడీషీట్ తెరిచిన సందర్బాలూ ఉన్నాయి. రాజకీయ జోక్యం తోనే రౌడి షీట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రౌడీషీట్‌కు ఎఫ్‌ఐఆర్ ఉండదు, కేసు ఉండదు.
ఏపీ హైకోర్టు సంచల తీర్పు..
రౌడీషీట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జస్టిస్ ఇవీఎస్.సోమయాజులు సంచలనమైన తీర్పు వెలువరించారు. వ్యక్తిగత వివరాలను, చిరునామాను పలు పోలీస్ స్టేషన్లో ప్రదర్శించొద్దు. అలాగే మీ తలపై ముసుగు వేసి , లేదా బహిరంగంగా ప్రెస్‌మీట్ పెట్టీ మీరూ రౌడీలు అనీ చెప్పటానికి కూడా వీలు లేదు. ఫొటోలు, వేలిముద్రలు తీసుకునే అధికారం కూడా పోలీసులకు లేదు. వ్యక్తిగత గోప్యత హక్కులను బంగపరచటానికి పోలీసులకు అధికారం లేదు అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు కూఏడా కేఎస్. పుట్టు స్వామి కేసులో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించరాదని పేర్కొంది. రౌడీలు అనడానికి పోలీసులకు ఎంత మాత్రం అధికారం లేదు.
పోలీసులపై కేసు పెట్టొచ్చు..
రౌడీషీట్ ఓపెన్ చేస్తే పోలీస్ అధికారులపైనా క్రమినల్ లేదా సివిల్ కేసు పెట్టొచ్చు. పరువు నష్టం దావా దాఖలు చేయొద్చు. కోర్టు దిక్కరణ కేసులు కూడా నమోదు చెయ్యొచ్చు. సుప్రీం కోర్టు, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలను బేస్ చేసుకుని పోలీసులపై చర్యను కోరవచ్చు.
రౌడీషీట్‌ను ఎలా ఎదుర్కోవాలి..
చాలా మంది రౌడీషీట్ ఓపెన్ కాగానే ఇక వారి జీవితం ముగిసిందని జీవితం ప్రమాదంలో పడిందని భావిస్తారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చాలా మందికి తెలియదు. రౌడీషీట్‌ను పోలీసులే క్లోజ్ చేయాలి. లేదా కోర్టు ఆదేశించాలి. పోలీస్ అధికారుల దృష్టిలో రౌడీ షీట్ నమోదు కాబడిన వ్యక్టి ప్రవర్తనలో మార్పు వచ్చిందని భావిస్తే ఎస్‌ఎచ్‌ఓ సూచన మేరకు తొలగించవచ్చు. కానీ ఎలాంటి కేసులు లేకున్నా, కేసులు కోర్టులలో కొట్టుడు పోయినా రౌడీషీట్‌ను పోలీసులు కొనసాగిస్తున్నారు. రెండోది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టులో సవాల్ చేస్తూ వాజ్యం వేయొచ్చు. రౌడీషీట్లకు చట్ట బద్దత లేదు కాబట్టి కచ్చితంగా కొట్టివేసే అవకాశం ఉంది.