
కరోనా వైరస్ కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ స్ధంబించాయి. దీంతో ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయ వనరుల్లో ప్రధానమైనవి వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీలు. ఖజానాకు రాబడిని పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చమురు ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. కొద్ది రోజుల వ్యవధిలోనే భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు సిద్ధమయ్యింది. భూముల క్రయ విక్రయాల సమయంలో ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూముల మార్కెట్ విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరిగనున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించనుంది.
Also Read: జగన్ ను ఇరుకున పెడుతున్న వైసీపీ ఎంపీ?
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ప్రభుత్వం ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో లాక్ డౌన్ కొనసాగడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.39,529 కోట్లు ఆదాయం లభించాల్సి ఉండగా… కేవలం రూ.7,555 కోట్లు మాత్రమే వివిధ మార్గాల్లో ఆదాయం లభించింది. ఏప్రిల్ నెలలో రూ.1,123 కోట్లు, మే నెలలో రూ.2,498 కోట్లు, జూన్ నెలలో రూ.3,934 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా ఆర్ధిక శాఖ ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వం రూ.31,974 కోట్ల ఆదాయం కోల్పోయింది. లక్ష్యంలో కేవలం 19 శాతం మాత్రమే ఆదాయం లభించింది. దీంతో ప్రభుత్వం అప్పలు చేయక తప్పడం లేదు. ఏప్రిల్ లో రూ.5,000 కోట్లు, మే లో రూ.6,000 కోట్లను ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలు తెచ్చింది. ఈ మొత్తాన్ని 13 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంది. తోలి త్రైమాసికంలో ప్రభుత్వానికి రోజుకు రూ. 400 నుంచి 500 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 70 నుంచి 80 కోట్లు మాత్రమే లభించింది. దీంతో ప్రభుత్వం ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం భూముల విలువ ప్రాంతాల ఆధారంగా 5 నుంచి 50 శాతం వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ల శాఖ ఆ వివరాలను పెంచనున్న భూముల మార్కెట్ విలువల వివరాలను ఇంకా వెల్లడించలేదు. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ ఓక్కో రకంగా పెంచే అవకాశం ఉంది. స్థలాలో నిర్మాణాలు ఉంటే వాటి విలువను ప్రభుత్వం పెంచింది. భూమి మార్కెట్ విలువకు అధనంగా నిర్మాణల విలువ కట్టి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా రిజిస్ట్రేషన్ ల సంఖ్య తగ్గిపోయింది. భూముల క్రయవిక్రయాలు జరగడం లేదు. ఫలితంగా గడచిన మూడు నెలల్లో స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లభించలేదు. భూముల మర్కెట్ విలువ పెంపు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రజలకు భారంగానే మారనుంది. భూములు కొనుగోలు చేయడమే గగనంగా ఉన్న పరిస్థితిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ ఎక్కువ మొత్తంలో ఉండటంతో ప్రజలు భారంగా భావిస్తున్నారు.