https://oktelugu.com/

Anand Mahindra : వాళ్లతో పెట్టుకోకండి.. శత్రుదేశాల సైన్యానికి ఆనంద్ మహీంద్రా సలహా!

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో సైనిక పరేడ్‌ మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 27, 2024 9:25 pm
    Follow us on

    Anand Mahindra : భారత 75వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. మన దేశ సైనిక శక్తిని కొనియడారు. అదే సమయంలో శత్రుదేశాలకు ఓ సలహాతోపాటు సున్నిత హెచ్చరిక కూడా చేశారు.

    ఎక్స్‌లో పరేడ్‌ వీడియో..
    సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైనిక పరేడ్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇతర దేశాల సైన్యానికి నాదో వ్యక్తిగత సలహా.. వీళ్లతో ఎప్పుడూ పెట్టుకోవద్దు’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు. మన సైన్యం శక్తి సామర్ధ్యాలను ఉద్దేశిస్తూ ‘భారత్ దృఢంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా ఏమోజీలను జత చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

    మన సైనిక శక్తిని చాటిన పరేడ్‌
    ఇదిలా ఉంటే 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో సైనిక పరేడ్‌ మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశీయంగా తయారు చసిన ఆయుధాలతోపాటు నాగ్‌ క్షిపుణులు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, పినాక మల్టీపుల్‌ రాకెట్‌ వ్యవస్థ, వెపన్‌ లొకేషన్‌ రాడార్‌ వ్యస్తలు, బీఎంపీ-2 సాయుధ శకటాలు ప్రదర్శించారు. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన నారీ మణులు కర్తవ్యపథ్‌లో నిర్వహించిన కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.